Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 8 మంది మృతి

Road Accident: స్పాట్‌లోనే 8 మంది ప్రయాణికులు మృతి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Sept 2024 4:52 PM IST
Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 8 మంది మృతి
X

Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 8 మంది మృతి

Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలిఘాట్ దగ్గర రెండు లారీలను బస్సు ఢీకొనడంతో ఎనిమిది మంది స్పాట్‌లోనే మృతి చెందారు. ప్రమాదంలో మరో 30 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలమనేరు వైపు నుంచి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఒకదానికొకటి ఢీకొని మరో టెంపోపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story