YS Sharmila: కొంప కొల్లేరు అయ్యింది.. బెజవాడ‌పై షర్మిల హాట్ కామెంట్స్

YS Sharmila: భారీ ఎత్తున విపత్తు సంభవిస్తే మోడీ కనీసం స్పందించలేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Sept 2024 7:22 PM IST
YS Sharmila
X

YS Sharmila

YS Sharmila: ఏపీలో వరద ఉధృతిని ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరిశీలించారు. విజయవాడలో వచ్చిన వరద కేంద్రానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర విపత్తును జాతీయ విపత్తుగా పరిగణించాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కనీసం 25 లక్షలు.. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేస్తున్న సహాయక చర్యలు సంతోషకరమైనప్పటికీ గ్రౌండ్ లెవల్ లో చేరడం లేదన్నారు. తెలంగాణలో హైడ్రా మాదిరిగా బుడమేరు ఆక్రమణలు తొలగించాలని షర్మిల సూచించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story