Tirumala: తిరుమల క్యూ లైన్లో పాము కాటుకు గురైన భక్తురాలు

Tirumala:  తిరుమల క్యూ లైన్లో పాము కాటుకు గురైన భక్తురాలు
x
Highlights

తిరుమల శ్రీవారి దర్శం క్యూ లైన్లో ఒక భాతురాలు పాము కాటుకు గురైంది

Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఒక భక్తురాలు పాముకాటుకు గురైన సంఘటన కలకలం రేపింది. దర్శనం కోసం 300 రూపాయల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్న సమయంలో ఇది జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణాకు చెందిన 27 ఏళ్ల మౌనికను పాము కాటు వేసినట్టు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే టీటీడీ సిబ్బంది ఆమెను అశ్విని ఆసుపత్రికి చేర్చారు.

అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్య సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు వివరించారు.

కాగా, తిరుమలలో ఇటువంటి ఘటనలు జరగడం చాలా అరుదు. భక్తుల క్యూ లైన్లలో ఏర్పాట్లు ఎప్పటికప్పుడు సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. భక్తుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు . ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అక్కడి భక్తుల్లో కలకలం రేపింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories