Srikanth Reddy: టీడీపీకి ఆ అర్హత లేదు

Srikanth Reddy: సాగునీటి హక్కుపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

Arun Chilukuri
Published on: 21 July 2021 8:16 PM IST
Srikanth Reddy Slams Chandrababu on Irrigation Projects
X

Srikanth Reddy: టీడీపీకి ఆ అర్హత లేదు

Srikanth Reddy: సాగునీటి హక్కుపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 1994 నుండి 2004 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్‌లో ఏ ప్రాజెక్టు చేపట్టకపోవడంతో ఏపీకి చాలా అన్యాయం జరిగిందన్నారు. వ్యవసాయం దండగని డైరీలో రాసుకుని సీమ వాసులను గుండెకోతకు గురి చేశారని ఆరోపించారు. నిధులు ఇవ్వకుండా శంకుస్థాపనలు చేసిన ఘనత బాబుదేనని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడంలో బాబు దిట్ట అని, ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతలపై తన విధానామేమిటో చెప్పాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story