అదరగొట్టిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ… నిజమైన సభలా హోరెత్తించిన చిన్నారులు

అదరగొట్టిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ… నిజమైన సభలా హోరెత్తించిన చిన్నారులు
x

అదరగొట్టిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ… నిజమైన సభలా హోరెత్తించిన చిన్నారులు

Highlights

విపక్షం... ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం... వెల్‌లోకి దూసుకొచ్చిన సభ్యులు... బిల్లుల ఆమోదం.... ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మాక్ అసెంబ్లీ ఆద్యంతం ఆకట్టుకుంది.

విపక్షం... ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం... వెల్‌లోకి దూసుకొచ్చిన సభ్యులు... బిల్లుల ఆమోదం.... ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మాక్ అసెంబ్లీ ఆద్యంతం ఆకట్టుకుంది. రాజకీయ నేతలకు తీసిపోనివిధంగా పిల్లలు అదరగొట్టారు. 45వేల పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.


రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ మావన వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. 175 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు మాక్ అసెంబ్లీలో పాల్గొని వాగ్దాటిని చాటారు. ప్రొటెం స్పీకర్ ఎన్నిక, స్పీకర్ ఎన్నిక... క్వశ్చన్ అవర్ నిర్వహించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులుగా వ్యవహరించిన వారు సమాధానమిచ్చారు.


మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం.లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యా శాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్‌గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు. మాక్ అసెంబ్లీలో సోషల్ మీడియా నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించి ఆమోదించారు.


విపక్షం, ప్రతిపక్ష సభ్యుల విమర్శలు, ప్రతి విమర్శలతో మాక్ అసెంబ్లీ హోరెత్తింది. అరుపులు కేకలతో దద్దరిల్లింది. ఒక దశలో సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు.


పిల్లల మాక్ అసెంబ్లీని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు, లోకేష్‌తో పాటు పలువురు మంత్రులు ప్రత్యక్ష వీక్షించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫొటోకు చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇతర నేతలు నివాళి అర్పించారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రాజ్యాంగ ప్రతి పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.


ఏటా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు మంత్రి లోకేష్. ప్రాథమిక హక్కులే కాదు.. ప్రాథమిక బాధ్యతలు తెలుసుకోవాలన్నారు. పిల్లల మాక్ అసెంబ్లీ అద్బుతంగా ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొనియాడారు. నిరంతరం శ్రమతోనే అనుకున్నది సాధించగలమని చంద్రబాబు అన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. బాధ్యత గుర్తు పెట్టుకునేలా.. స్ఫూర్తినిచ్చేలా మాక్ అసెంబ్లీ నిర్వహించారని ప్రశంసలు కురిపించారు.


విద్యార్థులు నిజమైన అసెంబ్లీని తలపించేలా తమ ప్రదర్శన కనబరిచారు. పిల్లల వాగ్ధాటిని చూసి చంద్రబాబు, లోకేష్‌ నవ్వుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories