TDP : అనంతలో టీడీపీ అధ్యక్ష పగ్గాలపై నేతల అనాసక్తి..!

TDP : అనంతలో టీడీపీ అధ్యక్ష పగ్గాలపై నేతల అనాసక్తి..!
x

TDP : అనంతలో టీడీపీ అధ్యక్ష పగ్గాలపై నేతల అనాసక్తి..!

Highlights

ఏపీలో పూర్తి కాని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకాలు జిల్లా అధ్యక్ష రేసుకు వారి మాటల్లో వైరాగ్యం ఉమ్మడి అనంతలో 14 అసెంబ్లీ, 2ఎంపీ స్థానాల్లో కూటమి విజయం గత తాత్కాలిక కమిటీల్లో బీసీలకు పెద్దపీట

అధికార పార్టీలో జిల్లా అధ్యక్ష పదవంటే ప్రతి ఒక్కరూ పోటీ పడతారు. జిల్లా పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ అందరితో సంబంధాలు కొనసాగించవచ్చని ఆశపడతారు. అధ్యక్ష అనే పిలుపు కోసం కీలక నేతలు ఆరాటపడుతారు. కానీ అనంతపురం తమ్ముళ్లలో మాత్రం ఆ పదవిపై అనాసక్తి కనిపిస్తోందట. మొన్నటి వరకు పదవి కావాలన్న వారిలోనూ వైరాగ్యం కలుగుతోందట. ఇంతకు అనంత టీడీపీలో ఏం జరుగుతోంది. పార్టీ పదవి కోసం పోటీ పడే తమ్ముళ్లు ఎందుకు వెనకడుగు వేస్తూన్నారు..? వాచ్ దీస్ స్టోరీ...?


పదవి అంటే ఎవరికి చేదు చెప్పండి. అందున జిల్లా అధ్యక్ష పదవి. పైగా అధికారంలో ఉన్న పార్టీ. పదవి నాకేంటే, లేదు మాకంటు పోటీ పడుతుంటారు. కానీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో.. టీడీపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు లీడర్లు కొంత జంకుతున్నారట. జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులే అందుకు కారణం అంటున్నారు.


ఏపీ వ్యాప్తంగా టీడీపీలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకాలు పూర్తి కాలేదు. అధికార పార్టీ కావడంతో.. పలు జిల్లాల్లో ఈ పదవిని ఆశిస్తూన్న వారు చాలా మందే ఉన్నారు. అనంతపురం జిల్లాలోనూ గతంలో పలువురు జిల్లా అధ్యక్ష చైర్‌ను ఆశించినప్పటికీ తాజాగా వారి మాటల్లో వైరాగ్యం వినిపిస్తోందట. అధ్యక్ష పదవి తీసుకోవడం అవసరమా అన్న నిరాసక్తి కనబరుస్తూన్నారట. అందుకు అనేక కారణాలు లేకపోలేదని చెబుతున్నారు.


గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధించారు. ఎన్నికల ముందు చేపట్టిన తాత్కాలిక కమిటీల నియామకాల్లో విభజిత రెండు జిల్లాల్లో బీసీలకు పెద్దపీట వేసింది అధిష్టానం. యాదవ సామాజిక వర్గానికి చెందిన వెంకటశివుడు యాదవ్‌ను అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా, సత్యసాయి జిల్లాకు వడ్డెర సామాజిక వర్గానికి చెందిన అంజినప్పను నియమించారు. తాజాగా కొత్త అధ్యక్షుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. అందుకు గాను ఇప్పటికే రెండు జిల్లాల్లో పార్టీ సర్వసభ‌్య సమావేశాలు జరిగాయి. ముగ్గురు సభ్యుల కమిటీ..ఆశావహుల నుంచి ప్రతిపాదనలు సేకరించారు. అధ్యక్ష పదవికి ఎవరు అర్హులు అన్నదానిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు.


సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామితో పాటు రాప్తాడు నియోజకవర్గానికి చెందిన రంగయ్య పేర్లను ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్లు సమాచారం. జిల్లాలో మంత్రి సవితమ్మతో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సహా పలువురు నేతలు బీసీ సామాజిక వర్గానికి చెందిన గుండుమల తిప్పేస్వామి పేరును ప్రతిపాదించారట. ఎమ్మెల్యే బాలయ్య సమావేశానికి రానప్పటికీ తిప్పేస్వామికి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టెందుకు సానుకూలంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మూడు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి.. పార్టీ సీనియర్ నేత కావడంతో పాటు ప్రత్యర్థులకు ధీటైన సమాధానం ఇచ్చే నేతగా గుండుమల తిప్పేస్వామికి పేరుంది. పార్టీ గళాన్ని గట్టిగా వినిపించే నేతగా... అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా దాదాపు ఆయన పేరు ఖారారు అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంజినప్ప మరో మారు తనకే పదవి వస్తుందనే ఆశతో ఉన్నారు. బాలకృష్ణ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడం, అలాగే బీసీ లీడర్ కావడంతో మరోమారు అధ్యక్షుడిగా తానే కొనసాగుతానని ధీమా వ్యక్తం చేస్తూన్నారట.


ఇక అనంతపురం జిల్లా ప్రస్తుత అధ్యక్షుడిగా గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన వెంకట శివుడు యాదవ్ కొనసాగుతున్నారు. ఆయన సైతం మరోమారు డిస్ట్రిక్ ప్రెసిడెంట్ పదవి

తననే వరిస్తుందనే ఆశాభావంతో ఉన్నారట. గతంలో ఆ పదవి కోసం అనంతపురం నుంచి ఆ పార్టీ సీనియర్ నేత గడ్డం సుబ్రమణ్యం, కళ్యాణదుర్గం నుంచి రామ్మెహన్ చౌదరిని ప్రతిపాదించారు. అలాగే శింగనమల నియోజకవరవ్గానికి చెందిన సీనియర్ నేత, ఆలం నరసానాయుడు పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఐతే పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ ప్రతినిధిగా గట్టిగా పార్టీ వాయిస్ వినిపించగలిగిన బీసీ నేత కోసం అధిష్టానం ప్రయత్నిస్తోందట.


ఇదిలా ఉంటే..అధ్యక్ష ఎంపికకు జాప్యం జరగడంతో పాటు ఎమ్మెల్యేలందరితో సత్సంబంధాలు లేకపోవడంతో పదవిపై నేతలు అనాసక్తి చూపుతున్నారట. అనంతపురం జిల్లా పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు, ఎంపీ అంబికా లక్ష్మినారాయణ కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు నుంచే పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య విబేధాలు, గ్రూపు రాజకీయాలు కొనసాగుతూ వచ్చాయి. పార్టీలో ఉన్న సీనియర్ల మధ్య విబేధాలు ఇటీవల పతాక స్థాయికి చేరాయట. అధ్యక్షుడిగా వాటిని సరిచేసే పరిస్థితి లేదని తమ్ముళ్లు భావిస్తూన్నారట. శింగనమలతో పాటు పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. జిల్లాలో ఎమ్మెల్యేలు అధ్యక్షుడి మాట వినే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు భావస్తూన్నారట. జిల్లా నుంచి ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ కొనసాగుతున్నారు. రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ విధానాల్లో నిత్యం బిజిగా ఉంటూన్నారు పయ్యావుల.


మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం ఎమ్మెల్యేగా.. ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పార్టీ కార్యాలయానికి వచ్చిన దాఖలాలు లేవట. గుంతకల్లు కేంద్రంగా ఆ‍యన రాజకీయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో పాటు సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా రాజకీయాలతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూన్నారట. శింగనమల నియోజకవర్గంలో నేతల తీరు ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా తయారైందట. ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టి జిల్లాపై పట్టు సాధించడం, నేతల మధ్య నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు భావిస్తూన్నారట. పార్టీ పదవిలో కొనసాగి అపకీర్తి మూటగట్టుకోవడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమమని కొందరు సీనియర్ నేతలు భావిస్తూన్నారట.

ఎండ్ వాయిస్.. చూడాలి మరి పార్టీ అధిష్టానం రెండు జిల్లాలకు అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తూందో... అనంత జిల్లా పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తూందో...?

Show Full Article
Print Article
Next Story
More Stories