తిరుమలలో తెలుగమ్మాయి, అమెరికా అబ్బాయి పెళ్లి

Tirumala: అమెరికాలో ఒకే సంస్థలో పనిచేస్తున్న హర్షవి, ఫ్రాంక్‌

Jyothi
Updated on: 6 Aug 2022 3:54 PM IST
Telugu Girl And American Boy Get Married In Tirumala
X

తిరుమలలో తెలుగమ్మాయి, అమెరికా అబ్బాయి పెళ్లి

Tirumala: అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లిన తెలుగు అమ్మాయికి అక్కడి అబ్బాయి పరిచయం అయ్యాడు.. ఒకే సంస్థలో పనిచేస్తుండటంతో ఇద్దరి మధ్య స్నేహం చిగురించి ప్రేమకు దారి తీసింది. వారి ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలపడంతో వారు కూడా పెద్ద మనసుతో అంగీకరించారు. తిరుపతికి చెందిన జయచంద్రారెడ్డి, రాజేశ్వరి దంపతుల కుమార్తె హర్షవి బీటెక్‌ పూర్తి చేసి అమెరికాలోని బోస్టన్‌లోని ఓ సంస్థలో ఉద్యోగంలో చేరారు.

అదే సంస్థలో జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్న అమెరికాకు చెందిన డామియన్‌ ఫ్రాంక్‌తో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత వివాహం జరిపించాలన్న అమ్మాయి కుటుంబ సభ్యుల కోరికను ఫ్రాంక్‌ కుటుంబ సభ్యులు అంగీకరించారు ఇరు కుటుంబాల సమక్షంలో అక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది.


Jyothi

Jyothi

Next Story