వెన్నెలవలసలో ఉద్రిక్తత: థర్మల్ ప్లాంట్‌కు గిరిజనుల నిరసన

వెన్నెలవలసలో ఉద్రిక్తత: థర్మల్ ప్లాంట్‌కు గిరిజనుల నిరసన
x

వెన్నెలవలసలో ఉద్రిక్తత: థర్మల్ ప్లాంట్‌కు గిరిజనుల నిరసన

Highlights

శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గ్రామంలో ఉద్రిక్తత పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్థులు తమ గ్రామంలో థర్మల్ ప్లాంట్ వద్దంటూ... ఫైర్

శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ గ్రామంలో థర్మల్ పవన్ ప్లాంట్ నిర్మాణంపై ఎమ్మెల్యే రవికుమార్‌ను గ్రామస్థులు నిలదీశారు. తమ గ్రామంలో ఎలాంటి థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టొద్దని నిరసన తెలిపారు. థర్మల్ ప్లాంట్ నిర్మిస్తున్నారని ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో.. సిబ్బంది గిరిజనులను అడ్డుకుని... పక్కకు తీసుకెళ్లారు. దీంతో పోలీసులకు.. గిరిజనులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. స్పందించిన ఎమ్మెల్యే కూన రవికుమార్ గిరిజనుల దగ్గరకు వెళ్లి.. థర్మల్ ప్లాంట్ వస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. కొందరు దుష్ప్రాచారం చేస్తున్నారని.. వాటిని నమ్మొద్దని ఎమ్మెల్యే సూచించారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదనలు ఉంటే.. మీ అభిప్రాయం తీసుకున్న తర్వాతనే నిర్మాణాలు చేపడ్తాం.


ధర్మల్ పవర్ ప్లాంట్ వద్దు అంటూ ఎమ్మెల్యే రవికుమార్ పై గిరిజనులు అగ్రహారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూర రవికుమార్ గిరిజనులు మద్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం అలుముకుంది. పోలీసులు గిరిజనులు అడ్డుకోవడంతో పోలీసులకు,గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది . గిరిజనులతో ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వైసిపి నాయకులు, మిగతా సంఘాలు నాయకుల మాటలు నమ్మద్దు. ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తే మీ అభిప్రాయాలను తీసుకుని నిర్మాణం చేపడతామని సద్ది చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories