Prashanthi Reddy: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖ..!

Prashanthi Reddy: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖ..!
x
Highlights

Prashanthi Reddy: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఓ బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది.

Prashanthi Reddy: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఓ బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. ఈ నెల 17న ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి వచ్చాడు. అక్కడ భద్రతా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి వెళ్లిపోయాడు.

కార్యాలయ సిబ్బంది ఆ లేఖను తెరిచి చూడగా, అందులో “రూ.2 కోట్లు ఇవ్వాలి, లేకపోతే ప్రాణహాని తప్పదు” అని పేర్కొనడం గమనించారు. వెంటనే ఈ విషయం ఎమ్మెల్యే, ఎంపీకి తెలియజేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు గోప్యంగా విచారణ ప్రారంభించి, అల్లూరు మండలం ఇస్కపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అదనంగా, వేమిరెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని ప్రశ్నించగా, ఆయన సమాధానాలు సరిపోకపోవడంతో పాటు, ఆయన వద్ద నాలుగు మొబైల్ ఫోన్లు ఉండటాన్ని గుర్తించిన పోలీసులు అతడిని కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ ఘటనపై జిల్లా ఎస్‌పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ వచ్చిన విషయం నిజమని ధృవీకరించారు. దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories