Accident at Pithapuram : పిఠాపురంలో బస్సు-ఆటో ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు


Accident at Pithapuram : పిఠాపురంలో బస్సు-ఆటో ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
Accident at Pithapuram : కాకినాడ జిల్లా పిఠాపురంలో బస్సు, ఆటో ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కాకినాడ జిల్లా, పిఠాపురం:
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని మాధవ స్వామి కోనేరు సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో ఆటో ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సదా కాంతారావు (40), ప్రయాణికులు గోశాల వరలక్ష్మి (34), లగుడు వరలక్ష్మి (30) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై క్షతగాత్రులను బయటకు తీసి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల సమాచారం మేరకు లగుడు వరలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. మిగిలిన ఇద్దరు పిఠాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఆటో అధిక వేగంతో ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై విచారణ కొనసాగుతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



