Tirumala Ghee Tanker: నెయ్యి కోసం 'జనం' కక్కుర్తి.. ట్యాంకర్ బోల్తా పడితే బిందెలు, బకెట్లతో లూటీ!

Tirumala Ghee Tanker: నెయ్యి కోసం 'జనం' కక్కుర్తి.. ట్యాంకర్ బోల్తా పడితే బిందెలు, బకెట్లతో లూటీ!
Tirumala Ghee Tanker: ఏపీలోని కడప జిల్లాలో విస్తుపోయే ఘటన వెలుగుచూసింది.
Tirumala Ghee Tanker: ఏపీలోని కడప జిల్లాలో విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. పూణే నుంచి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ ప్రమాదవశాత్తూ బోల్తా పడటంతో.. సహాయక చర్యలు చేపట్టాల్సింది పోయి, స్థానికులు నెయ్యి కోసం ఎగబడ్డారు. బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో వచ్చి ట్యాంకర్‌ను ఖాళీ చేసిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
చిత్రావతి వంతెన వద్ద ప్రమాదం
వివరాల్లోకి వెళ్తే.. సుమారు 21 వేల లీటర్ల నెయ్యితో పూణే నుంచి బయలుదేరిన ట్యాంకర్, జమ్మలమడుగు పరిధిలోని కొండాపురం చిత్రావతి వంతెన సమీపంలో నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ట్యాంకర్ నుంచి నెయ్యి ధారగా కారుతుండటాన్ని గమనించిన స్థానికులు క్షణాల్లో అక్కడకు చేరుకున్నారు.
బిందెలు, డ్రమ్ములతో లూటీ
ప్రమాదం జరిగిన విషయం తెలియగానే జనం బిందెలు, బకెట్లు, వాటర్ బాటిళ్లు, చెంబులు.. ఇలా ఏది దొరికితే అది పట్టుకుని పరుగు తీశారు. కొందరైతే ఏకంగా పెద్ద పెద్ద డ్రమ్ములు తీసుకువచ్చి నెయ్యిని నింపుకోవడం కనిపించింది. హైవేపై వెళ్తున్న బైకులు, కార్లు, ఆటోలు ఆపి మరీ జనం నెయ్యి కోసం ఎగబడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
పోలీసులు వచ్చేలోపే ఖాళీ!
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని జనాన్ని చెదరగొట్టారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 21 వేల లీటర్ల నెయ్యి ఉన్న ట్యాంకర్‌లో కేవలం 500 లీటర్లు మాత్రమే మిగిల్చి, మిగతాదంతా ఊడ్చేశారు. "జనాల కక్కుర్తికి ఇది నిదర్శనం" అంటూ నెటిజన్లు ఈ వీడియోలపై కామెంట్స్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



