డాక్టర్లైన కలెక్టర్, ఎమ్మెల్యే.. వృత్తి హోదాలెన్ని ఉన్నా.. రైతుతో కలిసి పొలంలో వరి నాట్లు!

డాక్టర్లైన కలెక్టర్, ఎమ్మెల్యే.. వృత్తి హోదాలెన్ని ఉన్నా.. రైతుతో కలిసి పొలంలో వరి నాట్లు!
x

డాక్టర్లైన కలెక్టర్, ఎమ్మెల్యే.. వృత్తి హోదాలెన్ని ఉన్నా.. రైతుతో కలిసి పొలంలో వరి నాట్లు!

Highlights

వారు ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నారు... ఒకరు జిల్లాలోని ప్రధాన పాలనాధికారి... మరొకరు సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు, వృత్తిపరంగా వేరు వేరు హోదాల్లో...

వారు ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నారు... ఒకరు జిల్లాలోని ప్రధాన పాలనాధికారి... మరొకరు సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు, వృత్తిపరంగా వేరు వేరు హోదాల్లో ఉన్నప్పటికీ చదువులో ఇద్దరూ వైద్య విద్యను అభ్యసించిన వారే... ప్రస్తుతం సూళ్ళూరుపేట శాసనసభ్యురాలుగా విజయశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరొకరు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.. రైతు కుటుంబం నుంచి వచ్చినా.. వారికి వ్యవసాయ మూలాలపై మమకారం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.

నాయుడిపేటలో అన్నధాత సుఖీభవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయశ్రీ, కలెక్టర్ వెంకటేశ్వర్ నిర్వహించారు. అనంతరం తిరుపతి వెళుతున్న వారికి చావలి సమీపంలో రైతులు పొలాల్లో నాట్లు వేస్తున్న దృశ్యాలు కనిపించాయి. వెంటనే రైతులతో కలిసి పొలాల్లో వారు నాట్లు వేశారు. దీంతో రైతులు, వ్యవసాయం పట్ల వారికి ఎంతో మమకారం ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories