Crime News: నెల్లూరు జిల్లాలో విషాదం.. నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య

Crime News: నెల్లూరు జిల్లాలో విషాదం.. నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య
x

Crime News: నెల్లూరు జిల్లాలో విషాదం.. నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య

Highlights

Crime News: నెల్లూరు జిల్లా కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Crime News: నెల్లూరు జిల్లా కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని కావలి రూరల్ మండలం అడవి రాజుపాలెంకు చెందిన ప్రణీతగా గుర్తించారు. సమాచారం అందుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. విగత జీవిగా పడి ఉన్న తమ కూతురిని చూసి బోరున విలపించారు.

గతంలో ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక ఆరవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఇటీవల ఎదురుగా వచ్చిన ప్రిన్సిపల్‌కు మర్యాద ఇవ్వలేదని ఆరవ తరగతి విద్యార్థిని రక్తం వచ్చేలా కొట్టి వాష్‌రూంమ్‌లో బంధించాడు. ఈ వ్యవహారంలో విద్యా సంఘాలు తీవ్రస్థాయిలో పాఠశాల వద్ద ఆందోళన చేపట్టాయి. దీంతో అప్పటి ప్రిన్సిపల్ పెత్తన స్వామిని ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. వరుస ఘటనలతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories