Anantapur: కొడుకు గొంతు కోసి తల్లి ఆత్మహత్య

Anantapur: కొడుకు గొంతు కోసి తల్లి ఆత్మహత్య
x

Anantapur: కొడుకు గొంతు కోసి తల్లి ఆత్మహత్య

Highlights

Anantapur: అనంతపురం జిల్లా కేంద్రంలోని శారదా నగర్ ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

Anantapur: అనంతపురం జిల్లా కేంద్రంలోని శారదా నగర్ ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఒక తల్లి తన మూడేళ్ల కుమారుడి గొంతు కోసి హతమార్చిన అనంతరం, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మృతురాలు అమూల్యగా గుర్తించారు. ఆమె రామగిరి డిప్యూటీ తహసీల్దార్ అయిన రవి భార్య అని తెలిసింది. కుటుంబ కలహాలు లేదా వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పూర్తి వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories