Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. మంటలు చెలరేగి వికావేరి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. మంటలు చెలరేగి వికావేరి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం
x
Highlights

Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో అగ్ని ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అగ్నిప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవదహనం అయ్యారు. బస్సులో 45 మంది వరకు ప్రయాణిస్తున్నారు. 12 మంది వరకు బయటపడినట్లు, 10 మందికి పైగా దుర్మరణం చెందినట్లు సమాచారం.

హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివారులో ఉలిందకొండ సమీపంలోకి రాగానే వెనక నుంచి వస్తున్న భైక్‌ ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందికి వెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు అంతా మంటలు వ్యాప్తిచెందాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని కొందరు బయటపడగా, పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు.. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌కి చెందిన వారు ఉన్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories