TTD Board Chairman BR Naidu: టీడీడీ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా మాట్లాడేవారిపై కఠిన చర్యలు

TTD Board Chairman BR Naidu: టీడీడీ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా మాట్లాడేవారిపై కఠిన చర్యలు
x
Highlights

TTD Board to Take Strict Action Against Those Who Defame the Temple

TTD Board Chairman BR Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా మాట్లాడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తిరుమల అన్నమయ్యభవన్‌లో పాలకమండలి సమావేశం జరిగింది. తిరుమలలో దరసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామనే విషయాన్ని పాలకమండలి సమావేశంలో ప్రాస్తావించారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారని పాలకమండలి ఛైర్మన్ రాజగోపాల్ నాయుడు తెలిపారు.

తిరుమలలో కొత్తగా కట్టిన భవనాలను చంద్రబాబునాయుడు చేతులమీదుగా ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న గరుడోత్సవంలో మూడులక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనావేస్తున్నామన్నారు. స్వామివారి లడ్డూ ప్రసాదాలను భారీస్థాయిలో భక్తులకు అందుబాటులో ఉంచే విధంగా పాలక మండలి చర్యలు తీసుకుందని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories