యాంకర్ శివజ్యోతి పై టీటీడీ కఠిన చర్య – ఆధార్ బ్లాక్, శ్రీవారి దర్శనంపై నిషేధం!

యాంకర్ శివజ్యోతి పై టీటీడీ కఠిన చర్య – ఆధార్ బ్లాక్, శ్రీవారి దర్శనంపై నిషేధం!
x

యాంకర్ శివజ్యోతి పై టీటీడీ కఠిన చర్య – ఆధార్ బ్లాక్, శ్రీవారి దర్శనంపై నిషేధం!

Highlights

ప్రముఖ యాంకర్‌ శివ జ్యోతిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆమె తిరుమల అన్నప్రసాదం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, భవిష్యత్‌లో ఆమెకు శ్రీవారి దర్శనం నిషేధిస్తూ ఆధార్‌ను బ్లాక్ చేసింది.

యాంకర్‌ శివజ్యోతి చేసిన తాజా వ్యాఖ్యల తరువాత టీటీడీ కఠినంగా స్పందించింది. తిరుమల శ్రీవారి అన్నప్రసాదంపై ఆమె చేసిన కామెంట్‌— “కాస్ట్లీ ప్రసాదం.. మేము రిచెస్ట్ బిచ్చగాళ్లం”— వైరల్‌ అయ్యి వివాదంగా మారింది. ఆ తరువాత శివజ్యోతి క్షమాపణలు చెప్పినా, టీటీడీ మాత్రం సీరియస్‌గా తీసుకుని ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేసి, ఇకపై తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించబోమని నిర్ణయించింది.

ఈ సంఘటన ఇలా జరిగింది.

శివజ్యోతి తిరుమలకు దర్శనం కోసం వెళ్లి, క్యూలో ఉండగా ప్రసాదం తీసుకుంటూ చేసిన వ్యాఖ్యలు చాలామందిని ఆగ్రహానికి గురిచేశాయి. భక్తుల భావాలను దెబ్బతీశాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో వెంటనే ఆమె ఒక వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పింది. “నా ఉద్దేశ్యం తప్పుగా అర్థమైంది… స్వామిపై నా భక్తి బలంగా ఉంది” అని ఆమె వివరించింది.

కానీ టీటీడీ మాత్రం ఆమె చేసిన కామెంట్లను అపవిత్రమైన, అనుచితమైన వ్యాఖ్యలుగా పరిగణించింది. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణలో ఉంచేందుకు ఆమె ఆధార్‌ని సిస్టమ్‌లో పూర్తిగా బ్లాక్ చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ఆధార్ తప్పనిసరి కావడంతో, ఈ నిర్ణయం వల్ల శివజ్యోతి ఇకపై శ్రీవారి దర్శనం తీసుకోలేరు.

శివజ్యోతి బిగ్‌బాస్ ద్వారా ప్రజాదరణ పొందిన వ్యక్తి. తెలంగాణ యాసలో యాంకరింగ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఘటనతో ఆమె పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

టీటీడీ చర్యపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు. చాలా మంది టీటీడీ కఠిన చర్య మంచిదే అంటుండగా, కొందరు శివజ్యోతి ఇప్పటికే క్షమాపణలు చెప్పిందిగా అంటూ ఆమెకు మద్దతు ఇస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories