సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
x

సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

Highlights

సత్యసాయిబాబా జయంతి వేడుకలు ప్రశాంతి నిలయానికి కేంద్రమంత్రి గడ్కరీ దంపతులు సాయికుల్వంత్ సభా మందిరంలో నితిన్ గడ్కరీకి స్వాగతం సాయి మందిరంలోని సత్యసాయి మహాసమాధి దగ్గర.. పుష్పాలతో స్వామివారిని దర్శించుకున్న గడ్కరీ దంపతులు

సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సాయికుల్వంత్ సభా మందిరంలో కేంద్రమంత్రికి ఘనస్వాగతం పలికారు. నితిన్ గడ్కరీ దంపతులు సాయి మందిరంలోని సత్యసాయి మహా సమాధి దగ్గర పుష్పాలను ఉంచి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొన్నారు..


భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతోత్సవాలకు విచ్చేసిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందులదుర్గేష్లకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శాంతి భవన్ లో పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుట్టపర్తి నియోజవర్గం లో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డినీ ప్రత్యేకంగా కోరారు. పుట్టపర్తి నియోజవర్గం లో పుట్టపర్తి అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజవర్గం లో కొన్ని ప్రాంతాలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసే విధంగా తగిన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మంత్రి కందులదుర్గేష్ ను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories