Vijayawada: విజయవాడలో కిరాతకం.. వివాహిత నోట్లో బలవంతంగా పురుగుల మందు పోసిన ఉన్మాది.. ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు!

Vijayawada
x

Vijayawada: విజయవాడలో కిరాతకం.. వివాహిత నోట్లో బలవంతంగా పురుగుల మందు పోసిన ఉన్మాది.. ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు!

Highlights

Vijayawada: విజయవాడలో దారుణం! ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా, వివాహిత సంసారంలో చిచ్చు పెట్టి.. చివరికి ఆమె నోట్లో బలవంతంగా పురుగుల మందు పోసిన కిరాతకుడు. అజిత్ సింగ్ నగర్ పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు.

Vijayawada: ప్రేమ పేరుతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. కట్టుకున్న భర్త నుంచి విడదీయడమే కాకుండా, పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. చివరకు ఆమెను అంతమొందించేందుకు యత్నించాడు. విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

సంసారంలో చిచ్చు.. వరుస వేధింపులు: కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలానికి చెందిన ఓ యువతికి గతేడాది ఏప్రిల్‌లో వివాహమైంది. అయితే, ఆమెకు ముందే పరిచయమున్న భవానీశంకర్ అనే వ్యక్తి.. ఆమెను ప్రేమించానంటూ వెంటపడసాగాడు. అంతటితో ఆగక, ఆమె భర్తకు ఫోన్ చేసి తప్పుడు ఆరోపణలు చేయడంతో దంపతుల మధ్య గొడవలు మొదలై విడిపోయారు. బాధితురాలు తల్లిదండ్రుల వద్దకు వచ్చేసినా భవానీశంకర్ వేధింపులు ఆపలేదు.

హైదరాబాద్ వెళ్లినా వదలని వైనం: కుమార్తెను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ఆమెను హైదరాబాద్‌లోని ఒక హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. కానీ, ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా ఆమె అడ్రస్ కనుక్కున్న నిందితుడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. అతడి మాటలు నమ్మిన యువతి ఈ నెల 2న విజయవాడకు రాగా, దేవీనగర్‌లోని తన గదికి తీసుకెళ్లాడు.

అనుమానంతో దారుణం: ఈ నెల 3న యువతి ఫోన్ చెక్ చేసిన నిందితుడు, అందులో మరో యువకుడి నంబర్ ఉండటంతో ఆగ్రహానికి గురయ్యాడు. ఆమెను తీవ్రంగా కొట్టి హింసించాడు. భయపడిన యువతి హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లగా, మళ్లీ బలవంతంగా గదికి తీసుకొచ్చాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, ఉన్మాదిలా మారిన భవానీశంకర్ ఆమె నోట్లో బలవంతంగా పురుగుల మందు పోశాడు.

ఆస్పత్రిలో చేర్చి పరారీ: యువతి అపస్మారక స్థితికి చేరుకోవడంతో భయపడిన నిందితుడు, ఆమెను ఆస్పత్రిలో చేర్పించి ఆమె తల్లికి సమాచారం ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories