TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..ఆ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..ఆ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
x
Highlights

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు బిగ్ అలర్ట్. శ్రీవారి ఆలయంలో 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు...

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు బిగ్ అలర్ట్. శ్రీవారి ఆలయంలో 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 25వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30వ తేదీన ఉగాది పురస్కరించుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో 24,29 తేదీల్లో ఎలాంటి సిఫార్సులు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఈ నెల 23న స్వీకరించి 24వ తేదీన దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది.

వారంతం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. శనివారం తెల్లవారుజామున 5.30గంటల సమయంలో అలిపిరి సప్తగిరి చెక్ పోస్టు వద్ద ఘాట్ రోడ్డులో వాహనాలు బారులు తీరాయి. కాలినడకన వెళ్లే భక్తులతో అలిపిరి మొదటి మెట్టు వద్ద భారీ రద్దీ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories