Visakhapatnam : విశాఖపట్నం పోర్టు మరో ఘనత – దేశంలోనే మొదటి స్థానం

Visakhapatnam : విశాఖపట్నం పోర్టు మరో ఘనత – దేశంలోనే మొదటి స్థానం
x

Visakhapatnam : విశాఖపట్నం పోర్టు మరో ఘనత – దేశంలోనే మొదటి స్థానం

Highlights

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) మరో ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించింది. స్వచ్ఛత పఖ్వాడా అవార్డ్స్ 2024లో దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది.

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) మరో ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించింది. స్వచ్ఛత పఖ్వాడా అవార్డ్స్ 2024లో దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్ మంత్రిత్వశాఖ (MoPSW) నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీలో, శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అథారిటీ రెండో స్థానం, ఇండియన్ మేరిటైమ్ యూనివర్సిటీ మూడో స్థానం పొందాయి.

స్వచ్ఛత, పారిశుధ్య రంగాలలో విశాఖ పోర్టు చేపట్టిన విశేష కార్యక్రమాలు కేంద్ర మంత్రిత్వశాఖను ఆకట్టుకున్నాయి. “స్వచ్ఛత కి భాగీదారీ” మరియు “సంపూర్ణ స్వచ్ఛత” కింద పలు కార్యక్రమాలు అమలు చేశారు — భారీ స్థాయిలో శుభ్రతా డ్రైవులు, “ఏక్ పెడ్ మా కే నామ్” మొక్కల నాటడం, గోడలపై సృజనాత్మక చిత్రలేఖనం, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వచ్ఛ భారత్ సందేశాన్ని విస్తరించే పోటీలు నిర్వహించారు.

15 సంవత్సరాలుగా మునిగిపోయి ఉన్న పడవలను తొలగించడం, ఫిషింగ్ హార్బర్‌లో మెగా క్లీనప్ డ్రైవ్‌ నిర్వహించడం విశేషం. పారిశుద్ధ్య కార్మికుల కోసం సఫాయి మిత్ర సురక్ష శివిర్ నిర్వహించి, వైద్య పరీక్షలు, పీపీఈ కిట్ల పంపిణీ వంటి సేవలు అందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 31,800 మొక్కలు నాటటం, కంభాలకొండ ఈకో టూరిజం పార్క్‌లో 350 మందితో ట్రెక్కింగ్, శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు.

దేశంలో తొలి స్థానం సాధించినందుకు పోర్ట్ చైర్మన్ డా. ఎం. అంగముత్తు సిబ్బందిని, భాగస్వాములను అభినందించారు. “స్వచ్ఛ భారత్” లక్ష్యాలను సాధించేందుకు విశాఖపట్నం పోర్టు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. గతంలో మూడో స్థానంలో ఉన్న పోర్టు, ఈసారి అగ్రస్థానంలో నిలిచి మరో మైలురాయిని చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories