బాధ్యులను బోనెక్కిస్తాం, జైలుకు పంపిస్తాం: సజ్జల

బాధ్యులను బోనెక్కిస్తాం, జైలుకు పంపిస్తాం: సజ్జల
x
Highlights

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కామ్ కు పాల్పడుతుందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కామ్ కు పాల్పడుతుందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా చేసిన సంతకాల ప్రతులను తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వద్ద బుధవారం పరిశీలించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రజల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. కోటిమందికి పైగా చేసిన సంతకాలే... ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజానిరసనకు నిదర్శనమని, ప్రభుత్వ నిర్ణయంపై ఇది కచ్చితంగా రెఫరెండమే అని ఆయన చెప్పారు. ఏపీని మెడికల్ హబ్ గా మార్చాలని కలగన్న వైయస్.జగన్, అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. అయితే అధికారంలోకి రాగానే కాలేజీల నిర్మాణాలను నిలిపివేసిన చంద్రబాబు... కమిషన్ల కక్కుర్తితోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మమ్మాటికీ ముందస్తు కుట్రేనని.. . ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆక్షేపించారు.

కాలేజీల ప్రైవేటీకరణతో పాటు అప్పనంగా ఆస్తులు అప్పగిస్తున్న చంద్రబాబు.. అదనంగా 2 ఏళ్ల పాటు రూ.1400 కోట్లు జీతాలు ప్రభుత్వం నుంచి చెల్లించాలన్న నిర్ణయం.. మరో భారీ కుంభకోణమని స్పష్టం చేశారు. చంద్రబాబు తీరుకు నిరసనగా వైయస్.జగన్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గౌరవ గవర్నర్ కి కోటి సంతకాల ప్రతులు సమర్పిస్తారని తెలిపారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలని, లేకపోతే తాము అధికారంలోకి రాగానే వీటిపై సమీక్షిస్తామని సజ్జల చెప్పారు. బాధ్యులను బోనెక్కిస్తాం, జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.


ఏపీని మెడికల్ హబ్ చేయడమే జగన్ లక్ష్యం

‘‘ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకుని రావటమే కష్టం, అలాంటి అనుమతులన్నీ వైయస్.జగన్ సాధించి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కాలేజీలు తెచ్చారు. దేశంలోనే ఉత్తమ మెడికల్ హబ్ గా ఏపీని మార్చాలని జగన్ కలలు కన్నారు. ఆ మేరకు కింది స్థాయి నుండి పటిష్ఠం చేసుకుంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసింది. అనంతరం ప్రైవేటీకరణకు సిద్ధమైంది.’’ అని సజ్జల రామక‌ృష్ణారెడ్డి మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories