Weather Alert: మరో అల్పపీడనం ఆవిర్భావం.. ఆగని వానలే వానలు!

Weather Alert: మరో అల్పపీడనం ఆవిర్భావం.. ఆగని వానలే వానలు!
x

Weather Alert: మరో అల్పపీడనం ఆవిర్భావం.. ఆగని వానలే వానలు!

Highlights

ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్‌ 2 తర్వాత వర్షాల ప్రభావం మరింత పెరుగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా, దాని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథకుమార్‌ తెలిపారు. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఏపీలో కుండపోత వానలు

బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని రెండు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించారు. అలాగే, ప్రకాశం, నెల్లూరు, కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కొనసాగుతోంది.

తెలంగాణలో వర్షాల రౌద్రం

తెలంగాణలో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక మరికొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ వెవీ రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. మొత్తం 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. అందులో ఆదిలాబాద్‌, కొమురంభీం, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్‌, జనగామ, వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉన్నాయి.

అయితే, ఆదిలాబాద్‌, కొమురంభీం, నిర్మల్‌, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. రేపటికీ తెలంగాణలో మెజార్టీ జిల్లాల్లో భారీ వర్షాలే కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories