చంద్రబాబు పెళ్లిరోజు: పెళ్ళిచూపుల సమయంలో భువనేశ్వరితో చంద్రబాబు ఏం మాట్లాడారంటే?

Chandrababu Naidu Wedding
x

చంద్రబాబు పెళ్లిరోజు: పెళ్ళిచూపుల సమయంలో భువనేశ్వరితో చంద్రబాబు ఏం మాట్లాడారంటే?

Highlights

Chandrababu Naidu Wedding: అయితే, వీరి పెళ్ళి ఎలా కుదిరింది? చంద్రబాబు, భువనేశ్వరి పెళ్ళి మీటల మీదకు వెళ్ళే ముందు ఏం జరిగింది?

Chandrababu Naidu Wedding: చంద్రబాబునాయుడు, భువనేశ్వరిల పెళ్ళిరోజు ఈరోజు. వారు వివాహం చేసుకొని మంగళవారానికి 43 ఏళ్లు. విజయవాడలో వరద పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టరేట్ లోనే చంద్రబాబు ఉన్నారు. అక్కడికే ఆయన భార్య భువనేశ్వరి వచ్చారు. కొద్దిసేపు ఆయన ఆమెతో మాట్లాడారు. ఆ తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

అయితే, వీరి పెళ్ళి ఎలా కుదిరింది? చంద్రబాబు, భువనేశ్వరి పెళ్ళి మీటల మీదకు వెళ్ళే ముందు ఏం జరిగింది? ఈ రెండు కుటుంబాల సన్నిహితులు, సీనియర్ జర్నలిస్టులు కొందరు చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలివి.

ఎన్టీఆర్ నుంచే పిలుపు

1978లో చంద్రగిరి అసెంబ్లీ నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో టి. అంజయ్య మంత్రివర్గంలో చంద్రబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పదవి కూడా దక్కింది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న చంద్రబాబుకు సినీరంగ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తన కూతురు భువనేశ్వరికి చంద్రబాబుతో వివాహం జరిపించాలని ఎన్టీఆర్ భావించారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబుకు ఈ వర్తమానం పంపారు. అయితే, ఈ విషయమై తొలుత తమ ఇంట్లో పెద్దలతో చర్చించిన తర్వాత అభిప్రాయం చెబుతానని చంద్రబాబు సమాచారం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత భువనేశ్వరితో పెళ్లికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

భువనేశ్వరితో మొదటిసారి చంద్రబాబు ఏం మాట్లాడారంటే?

చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో భువనేశ్వరితో పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబుతో పాటు ఆయన స్నేహితులు కూడా వెళ్లారు. పెళ్లిచూపులు పూర్తైన తర్వాత భువనేశ్వరితో మాట్లాడాలని చంద్రబాబు ప్రతిపాదన పెట్టారు. తొలిసారిగా అప్పుడే ఆమెతో ఆయన మాట్లాడారు. ఆ రోజున భువనేశ్వరితో 15 నిమిషాలు మాట్లాడారు. ఆ సమయంలో ఆయన భువనేశ్వరిని అడిగిన మొదటి ప్రశ్న: మంత్రి పదవి, ఎమ్మెల్యే హోదా లేకపోతే, నారావారిపల్లెలోనే ఉండాల్సిన పరిస్థితులు వస్తే తనతో ఉండడానికి సిద్దమేనా? దానికి ఆమె, “సిద్దమే” అని సమాధానమిచ్చారు. అంతే, ఇక అప్పటి నుంచి ఆమె చంద్రబాబు వెన్నంటే ఉన్నారు.

చిత్తూరు జిల్లాలో ప్రతిఒక్కరికి ఆహ్వానం

తన పెళ్లిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లాలో ప్రతి ఇంటికో కార్డును పంపారు చంద్రబాబు. జిల్లా రాజకీయాల్లో అప్పుడప్పుడే చక్రం తిప్పుతున్న ఆయన తన పెళ్లికి జిల్లావాసులకు ఆహ్వానం పంపారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నందున సినీ రంగ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, చిత్తూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి ఘనంగా జరిపించాలని చంద్రబాబు ఎన్టీఆర్ ను కోరారు. ఆ కోరిక మేరకు ఎన్టీఆర్ కూడా ఈ పెళ్లిని ఘనంగా చేశారు.

కుటుంబసభ్యుల కోసం టైమ్

ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకున్నా కుటుంబం కోసం కొంత సమయం ఆయన కేటాయిస్తారు. ప్రతి ఆదివారం, ఇతర పండుగ రోజుల్లో కుటుంబ సభ్యులతో ఆయన గడుపుతారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం తర్వాత పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు సమయం కేటాయించరు. అత్యవసరమైతే మాత్రం వీటిని కూడా రద్దు చేసుకుంటారు. ప్రతి ఏటా సంక్రాంతికి నారావారిపల్లెకు కుటుంబసభ్యులతో వెళ్లి గడుపుతారు.

1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తన ఆహారపు అలవాట్లను మార్చుకున్నారు. ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని సాధించేవరకు విశ్రమించరు. అదే ఆయనకు తెలుగు రాజకీయాల్లో కీలకస్థానం దక్కేలా చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories