YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: దర్యాప్తుపై సీబీఐకి క్లీన్ చిట్.. ఎవరినైనా విచారించవచ్చు!

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు యథాతథంగా కొనసాగించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
గతంలో నెల రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐ కోర్టు విధించిన గడువుపై సుప్రీంకోర్టు స్పందించింది. ఆ ఉత్తర్వును సవరించి, దర్యాప్తును "సాధ్యమైనంత త్వరగా" పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దీనివల్ల దర్యాప్తు సంస్థపై ఉన్న సమయ పరిమితి ఒత్తిడి తగ్గనుంది.
దర్యాప్తు ప్రక్రియలో భాగంగా అవసరమైతే ఎవరినైనా పిలిచి విచారించే అధికారం సీబీఐకి ఉందని జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణకు సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేవని, ట్రయల్ కోర్టు నిబంధనల ప్రకారమే దర్యాప్తు ముందుకు తీసుకెళ్లాలని సూచించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో వివేకా కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



