Botsa Satyanarayana: ఏపీ అసెంబ్లీలో బొత్సకు అస్వస్థత

Botsa Satyanarayana: ఏపీ అసెంబ్లీలో బొత్సకు అస్వస్థత
x
Highlights

Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శుక్రవారం కలకలం రేగింది. వైసీపీ సీనియర్ నాయకుడు, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సభలో ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.

Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శుక్రవారం కలకలం రేగింది. వైసీపీ సీనియర్ నాయకుడు, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సభలో ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో సభలో ఉన్న సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు.

బడ్జెట్ అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతుండగా.. ఆయన ముఖంలో ఇబ్బందిని మంత్రి పయ్యావుల కేశవ్ గమనించారు. బొత్స నీరసించిపోవడాన్ని చూసిన మంత్రి, వెంటనే ఆయన ప్రసంగాన్ని ఆపి కూర్చోవాలని సూచించారు. సభలోని మార్షల్స్ మరియు అసెంబ్లీ అధికారులు వెంటనే అప్రమత్తమై బొత్సను సభ వెలుపలికి తీసుకెళ్లారు.

అసెంబ్లీ ఆవరణలోని డిస్పెన్సరీలో వైద్యులు బొత్సకు అత్యవసర పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రక్తపోటు (BP)లో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బొత్సకు విశ్రాంతి చాలా అవసరమని, ఆయన రెగ్యులర్ డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.

హైదరాబాద్‌కు తరలింపు?

ఇటీవలే బొత్స సత్యనారాయణ అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి వచ్చారు. తాజా అస్వస్థత నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మెరుగైన పరీక్షల కోసం ఆయనను తిరిగి హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సభ్యుడి అస్వస్థత పట్ల సభలోని అధికార, ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories