టెక్కలి వైసీపీలో సెగలు పుట్టిస్తున్న 'దువ్వాడ' రాజకీయం: జగన్ పిలుపుతో సీన్ రివర్స్.. భర్తకు చెక్ పెట్టేందుకు భార్య రెడీ?


టెక్కలి వైసీపీలో సెగలు పుట్టిస్తున్న 'దువ్వాడ' రాజకీయం: జగన్ పిలుపుతో సీన్ రివర్స్.. భర్తకు చెక్ పెట్టేందుకు భార్య రెడీ?
Tekkali: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడు. ప్రస్తుతం ఎమ్మెల్సీ. మైక్ దొరికితే చాలూ.. ఇంటా బయటా ఒకటే దూకుడు.
Tekkali: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడు. ప్రస్తుతం ఎమ్మెల్సీ. మైక్ దొరికితే చాలూ.. ఇంటా బయటా ఒకటే దూకుడు. తన వాగ్దాటితో పార్టీలో తాడేపల్లి ప్యాలెస్‌కు దగ్గరయ్యారు. జిల్లాలో సీనియర్ నేతలు ఆయనను అణచివేయాలని చూసినా.. ఆయన దూకుడు చూసిన తాడేపల్లి ప్యాలెస్.. ఎమ్మెల్సీగా ప్రమోట్ చేసింది. ఐతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబపరంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, కొన్ని ఇష్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడం.. కుటుంబ గొడవలు రోడ్డుపైకి రావడంతో పార్టీ వీడి బయటకు రావల్సి వచ్చింది. అది 2025 ఏప్రిల్ 25.. దువ్వాడను వైసీపీ సస్పెండ్ చేసింది. పేరుకే బయటకు వచ్చినా.. తాడేపల్లి ప్యాలెస్ ఏ కార్యక్రమం నిర్వహించినా ఆయన పాల్గొంటున్నారు. అంతేకాక తన అనుచరులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
తాజాగా అసెంబ్లీ ఆవరణలో దువ్వాడను చూసిన వైసీపీ అధినేత జగన్.. ఏం శీనన్నా.. అని పిలవడం, ఏం చేద్దాం శ్రీనివాస్ అంటూ మాట్లాడటం సోషల్ మీడియాలో హాట్ టాపికైంది. రాబోయే 2029 ఎన్నికలకు దువ్వాడ రీ ఎంట్రీ అంటూ ట్రోల్స్ మొదలయ్యాయట. అంతా చాప కింద నీరు అన్న చందాన దువ్వాడకు ఈ ఒక్క పిలుపు ఫుల్ రేంజ్లో పబ్లిసిటీ అయ్యిందట. తనకు జిల్లాలో ఉన్న పెద్దలతో ఉన్న విభేదాలను ఏకరువు పెట్టారనే టాక్. సరే దీనిపై వివరాలు పంపు అన్నారట. త్వరలో దువ్వాడ తాడేపల్లికి వెళ్లే అవకాశం ఉందని ఆయన వర్గీయుల టాక్. అధినేత జగన్‌తో మాటామంతితో దువ్వాడ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వైసీపీ అవకాశం ఇవ్వకపోతే సొంతంగా టెక్కలి బరిలో ఉంటానని దువ్వాడ తన అనుచరుల దగ్గర బాహటంగానే అంటున్నారట. జిల్లాలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు జిల్లా పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మిగతా కేడర్ వివరాలు జగన్‌కు వివరించేందుకు ఓ నివేదిక కూడా తయారు చేసుకున్నారనే టాక్ లేకపోలేదు.
వైసీపీ అధిష్టానానికి దగ్గరవుతే మన ఉనికి కష్టమేనన్న భావనతో కొందరు బడా నేతలు తనను పార్టీ నుంచి బహిష్కించేలా చేశారన్నది దువ్వాడ విమర్శ. గత కొన్ని నెలలుగా దువ్వాడ డైరెక్ట్‌గా జగన్‌తోనే టచ్‌లో ఉంటున్నారన్న టాక్ ఉంది. దీంతో రాబోయే ఎన్నికల్లో తనకు ఛాన్స్ ఉంటుందన్న ధీమాలో ఆయన ఉన్నారట. ఏదైనా కారణాలతో వైసీపీ సీటు దక్కకపోతే ఇండిపెండెంట్‌గానైనా బరిలో దిగుతానని దువ్వాడ తేల్చిచెబుతున్నా రట.ఇందులోభాగంగానే ఇప్పటికే టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ అనుచరులు పక్కా ప్లాన్ కూడా రెడీ చేశారట. విషయం తెలుసుకున్న పార్టీ పెద్దలు.. దువ్వాడను అడ్డుకోవాలంటే ఆయన భార్య వాణీయే కరెక్టు అని భావిస్తున్నారట. ఈ మధ్యకాలంలో దువ్వాడ వాణి ఇంటికి వెళ్లి.. కొంచెం క్రీయాశ్రీలక రాజకీయాల్లో యాక్టివ్ కావాలంటూ కోరారట. అందుకు ఆమె కూడా ఓకే చెప్పారట. టెక్కలిలో ఏ కార్యక్రమం జరిగినా తప్పనిసరిగా అక్కడ వాణి మేడమ్ ఉండాలంటూ జిల్లా పార్టీ నేతలు హుకుం జారీ చేశారట. అయితే జిల్లాలో మంత్రి అచ్చెన్నను ఎదుర్కొనే దమ్ము దువ్వాడ శ్రీనివాస్‌కు మాత్రమే ఉందంటూ ఆయన అనుచరులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారట.
దువ్వాడ రీ ఎంట్రీ, టెక్కలి నియోజకవర్గంలో వైసీపీలో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని, ఇది ధర్మాన బ్రదర్స్‌కు ఇబ్బందిగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో దువ్వాడ వాణి కూడా రాజకీయంగా యాక్టివ్ అవ్వడం, తన భర్తకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో టెక్కలి వైసీపీ రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకుంటాయో చూడాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



