Zakia Khanam: వైసీపీకి మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి జకియా ఖానం రాజీనామా..!

Zakia Khanam Joins in BJP After Resigns YSR Congress Party
x

Zakia Khanam: వైసీపీకి మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి జకియా ఖానం రాజీనామా..!

Highlights

Zakia Khanam-BJP: వైసీపీ బిగ్ షాక్ తగిలింది. మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌, వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం తన పదవికి రాజీనామా చేశారు.

Zakia Khanam-BJP: వైసీపీ బిగ్ షాక్ తగిలింది. మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌, వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మండలి ఛైర్మన్‌కు వ్యక్తిగత కార్యదర్శితో పంపించారు. జకియా ఖానంను 2020 జులైలో గవర్నర్​ఎమ్మెల్సీగా నామినేట్‌ చేశారు. జకియా ఖానం అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందినవారు. రెండేళ్ల నుంచి వైసీపీలో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. జకియా ఖానంతో కలిపి ఇప్పటివరకు వైసీపీకి ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇప్పటికే కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, మర్రి రాజశేఖర్​లు వైసీపీకి రాజీనామా చేశారు.

వైసీపీకి , ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానం బీజేపీలో చేరారు. రాజీనామా చేసిన అనంతరం ఆమె విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. జకియా ఖానంకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కండువా కప్పి ఆహ్వానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories