తెలుగు రాశి ఫలాలు | నేటి జాతక ఫలితాలు (13 జూన్ 2025): 12 రాశుల ఫలితాలు తెలుసుకోండి!

తెలుగు రాశి ఫలాలు | నేటి జాతక ఫలితాలు (13 జూన్ 2025): 12 రాశుల ఫలితాలు తెలుసుకోండి!
x

తెలుగు రాశి ఫలాలు | నేటి జాతక ఫలితాలు (13 జూన్ 2025): 12 రాశుల ఫలితాలు తెలుసుకోండి!

Highlights

13 జూన్ 2025 నేటి రాశి ఫలాలు – 12 రాశుల జాతక వివరాలు, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై రోజు ఎలా ఉంటుంది తెలుసుకోండి.

🔯 నేటి రాశి ఫలాలు (Today Horoscope in Telugu):

ఈ రోజు మీ రాశికి అనుగుణంగా ఎలా జరుగుతుంది? మీ ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన జ్యోతిష్య ఫలితాలపై ఒకసారి లుక్కేయండి.

♈ మేషం (Aries)

ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాలను నివారించండి. క్రమంగా సమస్యలు తగ్గుతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించండి.

♉ వృషభం (Taurus)

పనిలో శ్రమించి కొంత ఫలితం పొందుతారు. కుటుంబ విషయాలు ఆందోళన కలిగిస్తాయి. అధికారులతో జాగ్రత్త అవసరం. ఇష్టదైవం దర్శనం శుభప్రదం.

♊ మిథునం (Gemini)

అదృష్టం మీ వైపు ఉంటుంది. ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. కొత్త వస్తువుల కొనుగోలు జరగొచ్చు. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

♋ కర్కాటకం (Cancer)

ధైర్యంగా ముందుకు సాగితే విజయావకాశాలు మెరుగవుతాయి. బంధుమిత్రులతో సమయం బాగుంటుంది. మానసిక ఆనందం కలుగుతుంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

♌ సింహం (Leo)

పుణ్యవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవండి.

♍ కన్యా (Virgo)

పనుల్లో ఆలస్యం సంభవించవచ్చు. కష్టపడితే గుర్తింపు లభిస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండండి. విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదం.

♎ తుల (Libra)

పనులను సమర్థంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో శాంతి ఉంటుంది. సమాజంలో పేరు పెరుగుతుంది. దైవారాధన చేయడం శుభదాయకం.

♏ వృశ్చికం (Scorpio)

వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. నిస్సహాయంగా నిందలు పడే అవకాశం ఉంది. నవగ్రహ శ్లోకాలు చదవండి.

♐ ధనుస్సు (Sagittarius)

శుభఆలోచనలు విజయానికి దారి తీస్తాయి. మానసికంగా స్థిరత పెరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజ మంచిది.

♑ మకరం (Capricorn)

ఇతరుల సహకారం లభిస్తుంది. ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. కుటుంబంలో తగాదాలు తలెత్తవచ్చు. దుర్గా స్తోత్రం పఠించండి.

♒ కుంభం (Aquarius)

లక్ష్యం నిర్దేశించుకొని ముందుకెళితే విజయాలు మీ సొంతమవుతాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

♓ మీనం (Pisces)

విజయం మీవైపు ఉంటుంది. మంచి వార్తతో కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. శివారాధన శుభప్రదం.

Show Full Article
Print Article
Next Story
More Stories