Astrology Tips: ఈ రాశుల వారు ఇలాంటి ఉంగరం ధరిస్తే.. ఇక తిరుగులేదు

copper rings
x

Astrology Tips: ఈ రాశుల వారు ఇలాంటి ఉంగరం ధరిస్తే.. ఇక తిరుగులేదు

Highlights

Astrology Tips: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఉంగరం ధరించడం వల్ల వ్యక్తి జీవితంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు వస్తాయని నమ్ముతారు. ఉంగరం ఏ వేలికి ధరిస్తే, ఏ రత్నం ఉంటే ఆ వ్యక్తికి శుభం కలుగుతుందనేది జ్యోతిష్య శాస్త్రంలో వివరించబడింది.

Astrology Tips: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఉంగరం ధరించడం వల్ల వ్యక్తి జీవితంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు వస్తాయని నమ్ముతారు. ఉంగరం ఏ వేలికి ధరిస్తే, ఏ రత్నం ఉంటే ఆ వ్యక్తికి శుభం కలుగుతుందనేది జ్యోతిష్య శాస్త్రంలో వివరించబడింది. అయితే, చాలా మంది చేతులకు వివిధ రకాల ఉంగరాలు ధరిస్తారు. కొంతమంది బంగారం, వెండి ఉంగరాలు ధరిస్తే ఇంకొంత మంది రాగి ఉంగరాలు కూడా ధరిస్తారు. అయితే, రాగి ఉంగరం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రాగి ఉంగరం ధరించడం వల్ల వివిధ సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్యం చెబుతోంది. కొన్ని రాశుల వారికి, ఖరీదైన రత్నాల కంటే రాగి ఉంగరం చాలా మంచిది. ఇది అదృష్టాన్ని తెచ్చి జీవితాలను మారుస్తుంది. అయితే, రాగి ఉంగరం అందరికీ మంచి చేయదు. కేవలం కొన్ని రాశుల వ్యక్తులకు మాత్రమే ప్రయోజనాలను కలిగిస్తుంది. రాగి ఉంగరాన్ని ఎవరు ధరించాలి? దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు ? రాగి ఉంగరం ధరించేటప్పుడు ఏ నియమాలను పాటించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మూడు రాశుల వారు రాగి ఉంగరాలు ధరించడం మంచిది

మేషం, సింహ, ధనుస్సు అనే ఈ మూడు రాశుల వారు రాగి ఉంగరాలు ధరించడం మంచిది . ఈ రాశి వారు రాగి ఉంగరం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గౌరవం పెరగడంతో పాటు, ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. అంతేకాకుండా, శ్రేయస్సు, ఆర్థిక లాభం కూడా ఉంటుంది. అలాగే వారు గొప్ప నాయకులు అవుతారు.

దోషాలు తొలగిపోతాయి:

రాగి ఉంగరం ధరించడం వల్ల అనేక సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా సూర్య, కుజ దోషాల ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. సూర్యుడు, కుజుడు దోషాలు ఉన్నవారు రాగి ఉంగరాన్ని ధరిస్తే, వారి సమస్యలు పరిష్కారమవుతాయి. వారు సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా, రాగి ఉంగరం ధరించడం వల్ల మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఎముకలు బలపడతాయి.

ఈ రాశుల వారు రాగి ఉంగరాలు ధరించడం మంచిది కాదు:

వృషభం, కన్య, మకర రాశుల వారు రాగి ఉంగరాలు ధరించడం మంచిది కాదు. మీరు రాగి ఉంగరం ధరించాలని ఆలోచిస్తుంటే, జ్యోతిష్కుడి సలహా తీసుకోవడం మంచిది. లేకపోతే, దుష్ప్రభావాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories