Daily Horoscope Today: నేటి రాశి ఫలాలు...17-06-2024 సోమవారం

Daily Horoscope In Telugu Rashi Phalalu Panchangam Today 17th June 2024
x

Daily Horoscope Today: నేటి రాశి ఫలాలు...17-06-2024 సోమవారం

Highlights

Daily Horoscope Today: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ17-06-2024 సోమవారం. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

తేది: 17-06-2024 (సోమవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : ఏకాదశి పూర్తి

నక్షత్రం: చిత్త మధ్యాహ్నం గం.1.50 ని.ల వరకు తర్వాత స్వాతి

అమృతఘడియలు: ఉ. గం. 6.44 ని.ల నుంచి గం. 8.31 ని.ల వరకు

వర్జ్యం: సా. గం.7.56 ని.ల నుంచి రాత్రి గం. 9.40 ని.ల వరకు

దుర్ముహూర్తం : మధ్నాహ్నం గం.12.44 ని.ల నుంచి గం.1.36 ని.ల వరకు తర్వాత మధ్యాహ్నం గం.3.22 ని.ల నుంచి గం.4.14 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.21 ని.ల నుంచి గం. 9.00 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.42 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం.6.52 ని.లకు


మేషం :

యత్న కార్యం విజయవంతం అవుతుంది. ధనలాభం ఉంది. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రశంసలను పొందుతారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది.


వృషభం :

కార్యదక్షతను కనబరుస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. కీలక వ్యవహారంలో పరిణితిని కనబరుస్తారు. ప్రశంసలను పొందుతారు. బంధువుల తోడ్పాటు కూడా లభిస్తుంది.


మిథునం :

కీలక వ్యవహారాల్లో సొంత తెలివితేటలు పనిచేయవు. నీచమైన ఆలోచనలను దూరం పెట్టండి. మిత్రుల సహకారం తీసుకోండి. సంతానం శైలి వేదనను కలిగిస్తుంది. ఖర్చు తగ్గించండి. పార్వతీదేవిని పూజించండి


కర్కాటకం:

కార్యసాధనలో విపరీతమైన ఆటంకాలు వస్తాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. కొత్త అప్పు చేసే సూచన ఉంది. వృథాఖర్చులు తగ్గించాలి. మానసిక శాంతి లోపిస్తుంది. లక్ష్మీనృసింహస్వామిని పూజించండి.


సింహం :

వ్యవహారాల్లో విశేష లాభం పొందుతారు. కార్యదక్షతకు ప్రశంసలు లభిస్తాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. మిత్రులు తోడుంటారు. ఆత్మీయుల కలయిక మానసిక సౌఖ్యాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది.


కన్య :

ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఇతరుల వల్ల ఇబ్బందులు పడతారు. నోటి దురుసు తనం మంచిది కాదు. కుటుంబ సభ్యులపై శ్రద్ధ పెట్టాల్సి వుంటుంది. వేళకు భోజనం ఉండదు. పూచీలు ఉండకండి.


తుల :

అదృష్టం సహకరిస్తుంది. కీలక వ్యవహారాలు విజయవంతం అవుతాయి. కొత్త బాధ్యతలను చేపట్టాల్సి వస్తుంది. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. విందుల్లో పాల్గొంటారు. పెద్దల ప్రశంసలు పొందుతారు.


వృశ్చికం :

పనులు ఆశించిన రీతిలో సాగవు. డబ్బుకీ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మనసు కలతబారుతుంది. దూర ప్రయాణం గోచరిస్తోంది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించండి. సాంత్వనకు ఆంజనేయుణ్ణి ప్రార్థించండి.


ధనుస్సు :

ఆకాంక్ష నెరవేరుతుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. డబ్బుకి ఇబ్బంది ఉండదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బావుంటుంది. కీర్తి వృద్ధి చెందుతుంది.


మకరం :

వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. స్థిరచిత్తంతో కార్యాల్లో శుభఫలితాలను పొందుతారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. అధికారుల మన్ననలు పొందుతారు. గౌరవం పెరుగుతుంది.


కుంభం :

పనులు అనుకున్న రీతిలో సాగవు. డబ్బుకి ఇబ్బందిగానే ఉంటుంది. ఆత్మయులతో విరోధం విచారాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాలుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఖర్చు తగ్గించాలి. అమ్మవారిని ప్రార్థించండి.


మీనం :

ఇష్టంలేని పనులు చేయాల్సి వస్తుంది. చెప్పుడు మాటలు వినకండి. తగాదాలకు ఆస్కారం ఉంది. అధికారుల ఆగ్రహానికి గురయ్యే సూచన ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. దత్తాత్రేయ స్వామిని పూజించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories