Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే.. అన్నీ శుభపలితాలే..

Daily Horoscope In Telugu Rasi Phalalu Panchangam Today 24th May 2024
x

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే.. అన్నీ శుభపలితాలే..

Highlights

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే.. అన్నీ శుభపలితాలే..

(తేది: 24-05-2024, శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, కృష్ణ పక్షం

తిధి : పాడ్యమి రాత్రి గం.7.24 ని.ల వరకు ఆ తర్వాత విదియ

నక్షత్రం: అనూరాధ ఉదయం గం.10.10 ని.ల వరకు ఆ తర్వాత జ్యేష్ట

అమృతఘడియలు: అర్ధరాత్రి గం.1.38 ని.ల నుంచి గం.3.16 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.3.52 ని.ల నుంచి సా.గం.5.30 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉ. గం.8.18 ని.ల నుంచి గం.9.11 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.39 ని. లనుంచి గం.1.31 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.35 ని.ల నుంచి మ.గం.12.13 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.42 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.44 ని.లకు


మేషం :

కొర్టు వ్యవహారాల్లో అజాగ్రత్త తగదు. అనవసర వ్యవహారాల్లో తలదూర్చి ఆపదల్లో పడే సూచన ఉంది. పోటీలో అపజయం ఎదురవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలుంటాయి. విష్ణువును పూజించడం మేలు.


వృషభం :

ప్రయత్నాలు సఫలం అవుతాయి. అవసరమైన డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. ప్రయాణాలు ఉపయోగకరంగా సాగుతాయి. మానశ్శాంతిని పొందుతారు.


మిథునం :

శత్రువుల మీద పైచేయిని సాధిస్తారు. కీలక వ్యవహారంలో విజయం సిద్ధిస్తుంది. తల్లి సోదర వర్గం నుంచి అనూహ్య సహకారం లభిస్తుంది. నూతన వస్తువులు కొంటారు. దీర్ఘకాలిక వ్యాధి ఉపశమిస్తుంది.


కర్కాటకం:

ఆటంకాలు ఏర్పడతాయి. సంతాన విషయంగా, జీవిత భాగస్వామి సోదర వర్గం నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. ఇతరులతోనూ విరోధం గోచరిస్తోంది. నిరాశ వద్దు. శ్రీనివాసుని పూజించండి.


సింహం :

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. మనసు నిలకడగా ఉండదు. అవమానాలూ గోచరిస్తున్నాయి. భూసబంధ వ్యవహారాలు వాయిదా వేయండి. సర్టిఫికెట్లు జాగ్రత్త. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.


కన్య :

శుభ ఫలితాలుంటాయి. ఆదాయం మెరుగవుతుంది. దాయాదులతో సమస్యలు తొలగుతాయి. కీలక వ్యవహారాన్ని చక్కదిద్దుతారు. కుటుంబంలో శాంతి ఉంటుంది. బంధు, మిత్రులతో విందుల్లోపాల్గొంటారు.


తుల :

మీ మాట చెల్లుబాటు కాదు. బ్యాంకు లావాదేవీల్లో ప్రతికూలతలు ఉంటాయి. ఇతరుల వల్ల ఇబ్బందుల్లో పడతారు. కుటుంబ సభ్యుల తీరు మానసిక అశాంతికి కారణమవుతుంది. ఆంజనేయుడిని పూజించండి.


వృశ్చికం :

శుభదినం. ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. చక్కటి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. విందుల్లో పాల్గొంటారు. నూతన బాధ్యతలు చేపడతారు. గౌరవం పెరుగుతుంది.


ధనుస్సు :

పనులు అనుకున్నట్లుగా సాగవు. దుర్వ్యసనాలకు విపరీతంగా ఖర్చయ్యే సూచన ఉంది. నిద్రలేమి చికాకు పెడుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. అనవసర ప్రయాణాలు మానండి. దుర్గమ్మను పూజించండి.


మకరం :

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వివిధ రూపాల్లో సహాయం అందుతుంది. సంతానం పురోభివృద్ధి దిశగా సాగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు.


కుంభం :

వృత్తి, ఉద్యోగాల్లో పురోభివృద్ధిని సాధిస్తారు. పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. మేలిమి అవకాశాలు అందివస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు.


మీనం :

డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. శత్రువులు పెరుగుతారు. గురువు ఆశీస్సులను పొందుతారు. విధేయతను వదులుకోకండి. బలహీనతలను బయటపెట్టకండి. త్వరగా అలసిపోతారు. అమ్మవారిని పూజించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories