Horoscope Today: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా...

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Today 9th June
x

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా...

Highlights

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా...

(తేది 09-06-2024 : ఆదివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : తదియ మధ్యాహ్నం గం. 3.44 ని.ల వరకు ఆ తర్వాత చవితి

నక్షత్రం: పునర్వసు రాత్రి గం.8.20 ని.ల వరకు ఆ తర్వాత పుష్యమి

అమృతఘడియలు: సా. గం.5.52 ని.ల నుంచి గం. 7.31 ని.ల వరకు

వర్జ్యం: రేపు తె.వా. గం 4.47 ని.ల నుంచి గం.6.28 ని.ల వరకు

దుర్ముహూర్తం : సా. గం.5.05 ని.ల నుంచి గం.5.57 ని.ల వరకు

రాహుకాలం : సా. గం.5.11 ని. ల నుంచి గం.6.50 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా గం. 5.41 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.50 ని.లకు


మేషం : అన్నివైపులా మంచే జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో కార్యాలను సాధించుకుంటారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. మిత్రులు తోడుగా నిలుస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని, మానసిక ప్రశాంతతలను పొందుతారు.


వృషభం : ఆటంకాలుంటాయి. కార్యసాధనలో అప్రమత్తంగా ఉండాలి. మాట తప్పిన ఫలితంగా నిందలు మోయాల్సి వస్తుంది. ఇంట్లోనూ చికాకులుంటాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. సూర్యారాధన మేలు.


మిథునం : ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయులను కలుసుకుంటారు. కొత్త విషయాలు తెలుస్తాయి. కుటుంబ వ్యవహారాలు సవ్యంగా సాగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.


కర్కాటకం: కార్యనష్టం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. బంధువులతో విరోధం గోచరిస్తోంది. మాటలు తూలకండి. దూర ప్రదేశాలకు వెళ్లే సూచన ఉంది. వైద్యానికి ఖర్చు చేయాల్సి రావచ్చు. దత్తాత్రేయుణ్ణి పూజించండి.


సింహం: కాలం ఆనందంగా సాగుతుంది. మిత్రుల కారణంగా లబ్దిని పొందుతారు. సంతానానికి సంబంధించిన శుభవార్త అందుతుంది. శుభకార్యాల గురించి చర్చిస్తారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు.


కన్య: అభీష్టం నెరవేరుతుంది. స్థిర చిత్తంతో అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. కొత్త బాధ్యతలు చేపడతారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు. కీర్తి పెరుగుతుంది. అవకాశాలను చేజార్చవద్దు.


తుల: కలహాలకు దూరంగా ఉండండి. ఇంటికి దూరంగా వెళ్లే అవకాశాలున్నాయి. పనుల్లో త్వరగా అలసిపోతారు. ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళతారు. కడుపు సంబంధ ఇబ్బందులుంటాయి. శ్రీవేంకటేశ్వరుని పూజించండి.


వృశ్చికం: అనుకున్నట్లుగా పనులు కాకపోవడం చికాకును కలిగిస్తుంది. ఆత్మీయులతో గొడవలకు ఆస్కారం ఉంది. చెప్పుడు మాటలు నమ్మకండి. పైత్య సంబంధ సమస్యలుంటాయి. లక్ష్మీనృసింహస్వామిని పూజించండి.


ధనుస్సు: ఆనందకరంగా సాగుతుంది. సంకల్పం నెరవేరుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి.


మకరం: అన్ని పనులూ విజయవంతం అవుతాయి. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్ని పెంచుతుంది. అవసరానికి సరిపడినంత డబ్బు సమకూరుతుంది. కొత్త వస్తువులను కొంటారు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.


కుంభం: బద్ధకాన్ని విడిచి పెట్టాలి. శత్రువులపై ఓ కన్నేసి ఉంచాలి. మీ తెలివి తేటలకు తగిన గుర్తింపు లభించదు. ఆలోచనలు నీచంగా సాగుతాయి. విలువైన వస్తువుల చోరీకి ఆస్కారం ఉంది. అమ్మవారిని పూజించండి.


మీనం: బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతో విరోధం గోచరిస్తోంది. ఆచితూచి మాట్లాడండి. మానసిక అశాంతి గోచరిస్తోంది. ఆస్తి క్రయవిక్రయాలు వాయిదా వేయండి. వృథాఖర్చులుంటాయి. నవగ్రహారాధన మేలు.

Show Full Article
Print Article
Next Story
More Stories