
Today Horoscope (7 మార్చి 2026) : నేటి రాశి ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి అదృష్టం మాములుగా లేదు!
Today Horoscope 7 మార్చి 2026, శనివారం నాటి ద్వాదశ రాశి ఫలాలు ఇక్కడ ఉన్నాయి. వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం ,ఆర్థిక పరంగా మేషం నుండి మీనం వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Today Horoscope : 7 మార్చి 2026, శనివారం నాటి ద్వాదశ రాశి ఫలాలు ఇక్కడ ఉన్నాయి. వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం , ఆర్థిక పరంగా మేషం నుండి మీనం వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో పూర్తి వివరాలు చూద్దాం.
మేషం
ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ, సాయంత్రానికి ఒక శుభవార్త వింటారు. ముఖ్యమైన పనుల్లో తడబడకుండా నిర్ణయాలు తీసుకోండి.
వృషభం
ఆర్థికంగా ఈరోజు మీకు కలిసొస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. నూతన పెట్టుబడులకు ఇది మంచి సమయం.
మిథునం
మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మాట తీరుపై నిగ్రహం అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి.
కర్కాటకం
ఉద్యోగులకు పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
సింహం
వ్యాపారస్తులకు లాభాలు మెండుగా ఉన్నాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది.
కన్య
ఈరోజు కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరపు చర్చలకు దూరంగా ఉండండి. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. సహనం పాటించడం ఉత్తమం.
తుల
ప్రేమ వ్యవహారాలు ఫలించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ కాల్స్ రావచ్చు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆహార నియమాలు పాటించండి.
వృశ్చికం
స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణ పనుల్లో వేగం పెరుగుతుంది. సోదరుల సహాయ సహకారాలు అందుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి.
ధనుస్సు
వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన మార్పులు వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. దైవ దర్శనం చేసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మకరం
శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి గొడవలు రావచ్చు, సర్దుకుపోవడం మంచిది. శని దేవుడి ఆరాధన మేలు చేస్తుంది.
కుంభం
వ్యాపార విస్తరణకు ప్లాన్ చేస్తారు. పిల్లల పురోగతి సంతోషాన్నిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. సన్నిహితుల సలహాలు తీసుకోవడం మంచిది.
గమనిక: గ్రహ గతులు, నక్షత్రాల ఆధారంగా ఇవి సాధారణ ఫలితాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతక చక్రం ఆధారంగా ఫలితాలు మారవచ్చు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




