Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (2/4/2025)

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (2/4/2025)
x
Highlights

Daily Horoscope Today In Telugu, April 2, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, April 2, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, చైత్ర మాసం, ఉత్తరాయనం, హేమంత రుతువు, శుక్ల పక్షం

తిధి: పంచమి రాత్రి గం.11.49 ని.ల వరకు ఆ తర్వాత షష్ఠి

నక్షత్రం: కృత్తిక ఉదయం గం.8.49 ని.ల వరకు ఆ తర్వాత రోహిణి

అమృతఘడియలు: ఉదయం గం.6.39 ని.ల నుంచి గం.8.06 ని.ల వరకు మళ్లీ అర్ధరాత్రి దాటాక తె.వా. గం.4.04 ని.ల నుంచి గం.5.33 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.11.38 ని.ల నుంచి అర్ధరాత్రి దాటాక గం.1.07 ని.ల వరకు

దుర్ముహూర్తం: మధ్యాహ్నం గం.12.00 ని.ల నుంచి గం.12.50 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.12.00 ని.ల నుంచి గం.1.30 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.10 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.40 ని.లకు

మేషం

వ్యవహారాల్లో ఆటంకాలను దాటాల్సి ఉంటుంది. ఖర్చు కూడా పెరుగుతుంది. మాట తప్పడం వల్ల ఇబ్బంది వస్తుంది. అకారణ విరోధాలూ గోచరిస్తున్నాయి. నోటి దురుసును తగ్గించుకోండి. కుటుంబంపై శ్రద్ధ పెట్టండి.

వృషభం

కీలక సందర్భంలో అదృష్టం తోడుగా నిలుస్తుంది. చేపట్టిన కార్యాలు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. విందుల్లో పాల్గొంటారు.

మిథునం

పనులు అనుకున్న రీతిలో సాగవు. ఆర్థిక లావాదేవీలు చికాకు పెడతాయి. ఏకాంతాన్ని కోరుకుంటారు. కళ్లు, పాదాలకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి.

కర్కాటకం

కాలం ఆనందంగా సాగిపోతుంది. ఇష్టమైన వారితో వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలుతృప్తినిస్తాయి. శుభ కార్యం గురించి చర్చిస్తారు. అభీష్టం నెరవేరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. బంధాలు బలపడతాయి.

సింహం

ఉన్నత స్థాయిలోని వారి మద్దతు లభిస్తుంది. వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి. తండ్రి సామాజికస్థితి బాగుంటుంది. సొంతూరికి దూరంగా స్థిరనివాస యత్నాల్లో కదలిక ఉంటుంది. ఆత్మవిశ్వాసంపెరుగుతుంది.

కన్య

అశాంతి ఉంటుంది. బలహీనతలను అధిగమించాల్సి ఉంటుంది. ఆర్థిక అంశాల్లో ఆచితూచి వ్యవహరించండి. భవిష్యత్ గురించి ఆందోళన కలుగుతుంది. తీర్థక్షేత్ర సందర్శన ఉంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.

తుల

కీలక సమయంలో అదృష్టం ముఖం చాటేస్తుంది. అన్ని వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో నిర్లక్ష్యం వద్దు. తగాదాలకు ఆస్కారం ఉంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి.

వృశ్చికం

సాటివారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. కీర్తి పెరుగుతుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది.

ధనుస్సు

చేపట్టిన కార్యాలు సఫలం అవుతాయి. అవసరానికి బంధువులు, మిత్రులు సహకరిస్తారు. కోర్టు వివాదాలు అనుకూలంగా మారతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రత్యర్థులపై గెలుపు సాధిస్తారు. మనశ్శాంతిఉంటుంది.

మకరం

అభీష్టం నెరవేరే సూచన లేదు. ముఖ్యమైన నిర్ణయాల్లో ఆత్మీయులను సంప్రదించండి. బద్ధకం వల్ల సమస్య పెరుగుతుంది. చెడు ఆలోచనలను అదుపు చేయండి. వృథా ఖర్చులు తగ్గించాలి. అనవసర జోక్యం వద్దు.

కుంభం

ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. వాహన సంబంధ చికాకు ఎదురవుతుంది. స్థిరాస్తి లావాదేవీలు అనుకూలించవు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

మీనం

ఆకాంక్ష నెరవేరుతుంది. అన్నివైపులా శుభ ఫలితాలే ఉంటాయి. ఆర్థికంగా విశేష లాభం ఉంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని పెంచుతుంది. సోదరుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories