Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (9/1/2025)

Daily Horoscope Today In Telugu, January 9, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Published on: 9 Jan 2025 2:23 AM IST
Daily Horoscope Today
X

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (9/1/2025)

Daily Horoscope Today In Telugu, January 9, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

మేషం

అన్నీ అనుకున్నట్లే సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగప్రాప్తి ఉంది. అదృష్టం వరిస్తుంది.

వృషభం

ఒంటరితనాన్ని కోరుకుంటారు. బంధువుల తీరు ఆగ్రహానికి కారణమవుతుంది. కార్యజయం కోసం బాగా కష్టపడాలి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. ఇతరుల కోసం త్యాగం చేయాల్సి వస్తుంది.

మిథునం

శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మీయులను కలుస్తారు. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. ఆకాంక్ష నెరవేరడంతో ఉల్లాసంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో బంధువులు, మిత్రులు తోడుంటారు.

కర్కాటకం

వృత్తిపరమైన నైపుణ్యంతో పెద్దల మనసు గెలుస్తారు. అధికార వృద్ధి ఉంది. అభీష్టం సిద్ధిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అవకాశాలు అంది వస్తాయి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది

సింహం

సంతానం తీరు ఆవేదనకు కారణమవుతుంది. దూర ప్రయాణం గోచరిస్తోంది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా భద్రపరచండి. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శిస్తారు.

కన్య

వారసత్వపు ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. మీకు ప్రతికూల నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది. అనవసర విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వేళకు భోజనముండదు. తగాదాలకు దిగొద్దు.

తుల

బంధాలు బలపడతాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. ప్రయాణం ఆనందంగా సాగుతుంది. కీలక కుటుంబ వ్యవహారంలో జీవిత భాగస్వామి తోడుగా నిలుస్తారు. బంధువులు సహకరిస్తారు. మనశ్శాంతిని పొందుతారు.

వృశ్చికం

అన్ని పనులూ సవ్యంగా సాగుతాయి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. మీ సందేహాలన్నీ తొలగిపోతాయి.

ధనుస్సు

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీల్లో నిరాశ తప్పదు. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు ఉండదు. వాత సంబంధ అనారోగ్యం వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. అవమానం గోచరిస్తోంది.

మకరం

ఇంతవరకూ సమర్థించిన వాళ్లే వ్యతిరేకంగా మారతారు. ప్రతి పనికీ అడ్డంకులు వస్తాయి. బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతోనూ విరోధం ఏర్పడుతుంది. ఖర్చులను తగ్గించండి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

కుంభం

వ్యవహారాలు సవ్యంగా సాగుతాయి. నాయకత్వ లక్షణాలకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కీలక సమాచారం తృప్తినిస్తుంది. దగ్గరి ప్రయాణం గోచరిస్తోంది. సోదరులపై శ్రద్ధ పెడతారు.

మీనం

ఇతరుల వల్ల సమస్యలొస్తాయి. పనికి ఆటంకం ఏర్పడుతుంది. మనసులోని మాటను స్పష్టంగా చెప్పలేక ఇబ్బంది పడతారు. రెండో పెళ్లి ప్రయత్నం ఫలించదు. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త. వేళకు భోజనముండదు.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story