Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (14/3/2025)

Daily Horoscope Today In Telugu, March 14, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Published on: 14 March 2025 1:36 AM IST
Daily Horoscope Today
X

Daily Horoscope Today

Daily Horoscope Today In Telugu, March 14, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, పాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం

తిధి: పౌర్ణమి మధ్యాహ్నం గం.12.23 ని.ల వరకు ఆ తర్వాత పాడ్యమి

నక్షత్రం: ఉత్తర పూర్తి

అమృతఘడియలు: అర్ధరాత్రి దాటాక గం.12.49 ని.ల నుంచి గం.1.37 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.2.18 ని.ల నంచి గం.4.04 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.8.49 ని.ల నుంచి గం.9.37 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.49 ని.ల నుంచి గం.1.37 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.10.30 ని.ల నుంచి గం.12.00 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.25 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.26 ని.లకు

మేషం

మనోవేదన తీరుతుంది. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అదృష్టం తోడుంటుంది. న్యాయవివాదాలు పరిష్కారం అవుతాయి.

వృషభం

జరుగుతున్న ఘటనలు నిరాశపరుస్తాయి. అధైర్యపడకుండా కష్టపడితే మెరుగైన ఫలితాలు వస్తాయి. విరోధం పెరిగే వీలుంది. ఆలోచనలను నియంత్రించుకోవాలి. సమర్థతకు తగ్గ అవకాశాలు లభించవు. నిరాశ వద్దు.

మిథునం

ఆదాయానికి మించిన ఖర్చుంటుంది. పనులకూ అడ్డంకులు పెరుగుతాయి. ఒత్తిడి అధికంగా ఉంటుంది. సమర్థించేవారు దూరమయ్యే వీలుంది. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టాలి. వాహన సమస్య ఉంటుంది.

కర్కాటకం

మనసు ఉల్లాసంగా ఉంటుంది. వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. మిత్రులు తోడుగా నిలుస్తారు. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలుంటాయి. కమ్యూనికేషన్స్ రంగంలోని వారికి మేలిమి ఫలితాలుంటాయి.

సింహం

మాటకు విలువ ఉండదు. నోటిదురుసును అదుపు చేయాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ధన సంబంధ చిక్కులుంటాయి. వేళకు భోజనముండదు. రెండోపెళ్లి ప్రయత్నాలు అనుకూలించవు. మనశ్శాంతి లభించదు.

కన్య

అదృష్టం వరిస్తుంది. చేపట్టిన కార్యాలన్నీ సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

తుల

పనులు అనుకున్న రీతిలో సాగవు. ఖర్చు కూడా పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాన్ని వాయిదా వేయండి. మిత్రుల వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

వృశ్చికం

ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ధనలాభముంది. సంతాన సంబంధ శుభకార్యాచరణపై చర్చిస్తారు. ఆత్మీయులతో విందుకు హాజరవుతారు. ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి.

ధనుస్సు

అన్నింటా అనుకూలంగా ఉంటుంది. మెరుగైన జీవితానికి తగ్గ అవకాశాలు అందివస్తాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. పోటీలలో విజయం సాధిస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మనోవాంఛ నెరవేరుతుంది.

మకరం

పనుల పూర్తికి బాగా శ్రమించాలి. ఆర్థిక లావాదేవీలు తృప్తినివ్వవు. సంతానం వైఖరి చికాకును కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూరప్రయాణం గోచరిస్తోంది. బంధువుల వ్యవహారాల్లో జాగ్రత్త.

కుంభం

అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. చెడు ఆలోచనలను అదుపు చేయండి. చెప్పుడు మాటలను నమ్మితే ఇబ్బంది పడతారు. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త. అజీర్తి సమస్య ఉంటుంది.

మీనం

పనులు ఆశించిన రీతిలోనే సాగుతాయి. సంతాన సంబంధ అంశాలు తృప్తినిస్తాయి. ప్రయాణం లాభిస్తుంది. విందుకు హాజరవుతారు. ఇతరులతో సత్సంబంధాలుంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story