Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (19/3/2025)

Daily Horoscope Today
x

Daily Horoscope Today

Highlights

Daily Horoscope Today In Telugu, March 19, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, March 19, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, కృష్ణ పక్షం

తిధి: పంచమి అర్ధరాత్రి గం.12.36 ని.ల వరకు ఆ తర్వాత షష్ఠి

నక్షత్రం: విశాఖ రాత్రి గం.8.50 ని.ల వరకు ఆ తర్వాత అనూరాధ

అమృతఘడియలు: ఉదయం గం.10.57 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.44 ని.ల వరకు

వర్జ్యం: అర్ధరాత్రి దాటాక గం.1.17 ని.ల నుంచి తె.వా. గం.3.04 ని.ల వరకు

దుర్ముహూర్తం: మధ్యాహ్నం గం.12.00 ని.ల నుంచి గం.12.48 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.12.00 ని.ల నుంచి గం.1.30 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.21 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.27 ని.లకు

మేషం

లక్ష్య సాధనలో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. మనసు నిలకడగా ఉండదు. తగాదాలకు ఆస్కారం ఉంది. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుంటే ఉన్నతాధికారుల కోపానికి గురయ్యే వీలుంది. పంతం వద్దు.

వృషభం

పనులు అనుకున్నట్లే సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. బంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. ఉద్యోగులకు శుభ ఫలితాలుంటాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.

మిథునం

వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ధనలాభముంది. స్వస్థానప్రాప్తి గోచరిస్తోంది. బంధుమిత్రులను కలుస్తారు. మనోవేదన తీరుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అదృష్టం వరిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కర్కాటకం

పనులకు ఆటంకాలుంటాయి. బద్ధకాన్ని వీడి శ్రమించాల్సి ఉంటుంది. అభీష్టం నెరవేరే సూచన లేదు. సంతాన విషయాలు నిరాశ పరుస్తాయి. నిర్వహణ సామర్థ్యం తగ్గుతుంది. గొడవలకు ఆస్కారముంది. జాగ్రత్త.

సింహం

ఆస్తి సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆదాయానికి మించిన ఖర్చు చికాకు పెడుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల వ్యవహారాల్లో జాగ్రత్త. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.

కన్య

ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. కార్యజయం.. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సహచరుల నుంచి సహకారం లభిస్తుంది. సోదరుల విషయాలను పట్టించుకుంటారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది.

తుల

సకాలంలో పని పూర్తి కాక ఇబ్బంది పడతారు. నిందలు, అవమానాలు ఎదురవుతాయి. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కుటుంబ వ్యవహారాలు చికాకు పెడతాయి. వేళకు భోజనం ఉండదు.

వృశ్చికం

అన్ని రంగాల్లోని వారికీ శుభ ఫలితాలుంటాయి. ఆర్థికలబ్దిని పొందుతారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. గౌరవం పెరుగుతుంది. కీలకవేళ అదృష్టం వరిస్తుంది.

ధనుస్సు

అనుకున్న రీతిలో వ్యవహారాలు సాగవు. కోర్టు లావాదేవీల్లో నిర్లక్ష్యం వహిస్తే నష్టపోయే సూచన ఉంది. ఖర్చు పెరుగుతుంది. వేళకు భోజనముండదు. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. ప్రయాణాలు వద్దు.

మకరం

కాలం ఆనందంగా సాగుతుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇతరుల సహకారం లభిస్తుంది.

కుంభం

ప్రయత్నించిన ప్రతి కార్యం సఫలమవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వృత్తిపర నైపుణ్యాలతో రాణిస్తారు. ఉన్నత పదవుల్లోని వారి ప్రశంసలను పొందుతారు. గౌరవం పెరుగుతుంది.

మీనం

పనుల్లో జాప్యం ఉంటుంది. అశాంతిని వీడి కష్టపడండి. ధన సమస్యలుంటాయి. వివాదాల పరిష్కారానికి ప్రయత్నించండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories