Gemini Horoscope 2026: 2026లో మిథున రాశి వారికి శని–గురుడి అనుగ్రహంతో శుభఫలితాలే!

Gemini Horoscope 2026
x

Gemini Horoscope 2026: 2026లో మిథున రాశి వారికి శని–గురుడి అనుగ్రహంతో శుభఫలితాలే!

Highlights

Gemini Horoscope 2026 Prediction: మిథున రాశికి అధిపతి అయిన బుధుడితో పాటు గురుడు, శని సంచార ప్రభావంతో కెరీర్, ఆర్థిక స్థితి, కుటుంబ జీవితం వంటి రంగాల్లో మంచి మార్పులు కనిపించనున్నాయి.

Gemini Horoscope 2026 Prediction: జ్యోతిష్యం ప్రకారం 2026 నూతన సంవత్సరం మిథున రాశి వారికి అనేక విధాలుగా అనుకూలంగా ఉండనుందని పండితులు చెబుతున్నారు. మిథున రాశికి అధిపతి అయిన బుధుడితో పాటు గురుడు, శని సంచార ప్రభావంతో కెరీర్, ఆర్థిక స్థితి, కుటుంబ జీవితం వంటి రంగాల్లో మంచి మార్పులు కనిపించనున్నాయి.

ఈ ఏడాది ప్రారంభంలో గురుడు లగ్నస్థానంలో సంచారం చేయగా, శని కర్మస్థానంలో ఉండటం వల్ల కృషికి తగిన ఫలితాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలిపారు. రాహువు అష్టమస్థానంలో, చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండటంతో ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఆర్థిక పరిస్థితి

2026లో మిథున రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన బకాయిలు వసూలవుతాయి. ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో ఆస్తి కొనుగోలు, పెట్టుబడులకు అనుకూల సమయమని చెబుతున్నారు. పెట్టుబడులపై మంచి రాబడి వచ్చే అవకాశముంది.

కెరీర్ & ఉద్యోగం

ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యకాలంలో ఉద్యోగులు పదోన్నతులు, మంచి అవకాశాలు పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోరుకునే వారి కోరిక నెరవేరే సూచనలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

వ్యాపారం

వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉండనుంది. ఫిబ్రవరి 15 నుంచి జూన్ 15 వరకు, అలాగే సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అనుకూల సమయం. విదేశీ లావాదేవీల ద్వారా కూడా లాభాలు వచ్చే అవకాశముంది.

విద్య

విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. విదేశీ విద్యకు ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు దక్కవచ్చు.

ఆరోగ్యం

సంవత్సరం మొత్తంగా ఆరోగ్యం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కొంత జాగ్రత్త అవసరం. ఆహార నియమాలు పాటించడం, ధ్యానం చేయడం మంచిదని సూచిస్తున్నారు.

ప్రేమ, వివాహ జీవితం

ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లకు అనుకూల సమయం. దాంపత్య జీవితంలో సాధారణంగా సంతోషం ఉంటుంది. అయితే జనవరిలో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

సూచించిన పరిహారాలు

సూర్య భగవానుడికి నిత్యం పూజ

♦ సూర్య మంత్ర జపం

♦ సుందరకాండ పారాయణం

♦ మంగళవారం హనుమంతుడికి పూజ

♦ బుధవారం ఆకుపచ్చ దుస్తులు ధరించి విష్ణు పూజ

గమనిక: ఈ సమాచారం సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకులు దీనిని సూచనాత్మకంగా మాత్రమే పరిగణించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories