Horoscope Today, 22 June 2024: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఈ రోజు రాశిఫలాలు

Horoscope Telugu for Today, 22 June 2024: Read your today astrological predictions
x

Horoscope Today, 22 June 2024: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఈ రోజు రాశిఫలాలు

Highlights

Horoscope Telugu Today, 22 June 2024: మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

22-06-2024 (శనివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : పౌర్ణమి ఉ. గం.6.37 ని.ల వరకు ఆతర్వాత కృష్ణ పాడ్యమి (23వ తేదీ తె.వా. గం. 5.12 ని.ల వరకు)

నక్షత్రం: మూల సా. గం.5.54 ని.ల వరకు తర్వాత పూర్వాషాఢ

అమృతఘడియలు: ఉదయం గం.11.37 ని.ల నుంచి మధ్నాహ్నం గం. 1.11 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.4.20 ని.ల నుంచి గం.5.54 ని.ల వరకు మళ్లీ అర్ధరాత్రి దాటాక గం.3.10 ని.ల నుంచి గం.4.42 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.5.43 ని.ల నుంచి గం.7.29 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.9.01 ని.ల నుంచి గం.10.40 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.43 ని.లకు

సూర్యాస్తమయం : సా.గం.6.53 ని.లకు


మేషం :

కార్యసాధనకు బాగా శ్రమించాలి. ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి. కలహాలకు ఆస్కారం ఉంది. బలహీనతలను బయటపెట్టకండి. దూర ప్రయాణాలు గోచరిస్తున్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామిని పూజించండి.


వృషభం :

ఏపనీ సవ్యంగా సాగదు. అపోహల వల్ల ఇతరులపై దురభిప్రాయాలు ఏర్పడతాయి. చెడు ఆలోచనలు వస్తాయి. తగాదాలకు ఆస్కారం ఉంది. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఆంజనేయుణ్ణి పూజించండి.


మిథునం :

ఆనందంగా గడుపుతారు. పనులు మీరనుకున్నట్లే జరుగుతాయి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కీలక వ్యవహారం పరిష్కారమవుతుంది . ప్రయాణాలు లాభిస్తాయి. శారీరక, మానసిక శాంతిని పొందుతారు.


కర్కాటకం:

కార్యాలన్నీ విజయవంతంగా సాగుతాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. ధనసంబంధ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆత్మీయుల తోడ్పాటు లభిస్తుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు.


సింహం :

సోమరితనం మంచిది కాదు. వ్యవహారాలు ఫలించేందుకు బాగా శ్రమించాలి. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సూచనలను పాటించండి. ఖర్చులు తగ్గించాలి. అనుమానాలు వదిలేయాలి. విలువైన వస్తువులు జాగ్రత్త.


కన్య :

అనుకున్న ప్రకారం పనులు సాగవు. ఆటంకాలు ఎక్కువవుతాయి. బుద్ధి నిలకడగా ఉండదు. ఆవేశం అణచుకోకుంటే గొడవలకు ఆస్కారం ఉంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకుంటే మేలు.


తుల :

విశేష ఫలితాలను అందుకుంటారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. సోదరుల తోడ్పాటుతో ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కీలక సమాచారం అందుతుంది. ఆత్మీయులను కలుస్తారు. మనశ్శాంతి కలుగుతుంది.


వృశ్చికం :

ఇతరుల కారణంగా నష్టపోతారు. వ్యవహారాలేవీ సవ్యంగా సాగవు. సంపాదనకు మించి ఖర్చులుంటాయి. అశాంతి పెరుగుతుంది. ఎవరికీ పూచీగా ఉండకండి. నిందలొస్తాయి. లక్ష్మీనరసింహ స్వామిని పూజించండి.


ధనుస్సు :

కార్యజయం ఉంది. కీలకమైన సమయంలో అదృష్టం తోడవుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. విందుల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం తృప్తినిస్తుంది. మీ కార్యదక్షతకు ప్రముఖుల నుంచి ప్రశంసలొస్తాయి.


మకరం :

అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. వ్యవహారాలు అనుకూలంగా సాగవు. ఆర్థిక వ్యవహారాలు బెడిసికొట్టడం దిగులును కలిగిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. సుబ్రహ్మణ్యుణ్ణి పూజించండి.


కుంభం :

ఆనందమయంగా సాగుతుంది. ఉద్యోగులు అధికారుల మన్ననలు పొందుతారు. కొత్త పరిచయాలు పురోభివృద్ధికి దోహదపడతాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. అవసరమైన సౌకర్యాలు సమకూర్చుకుంటారు.


మీనం :

పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. నూతన అవకాశాలు అందివస్తాయి. బంధువులతో విందుల్లో పాల్గొంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories