Vastu Tip: కుబేర మొక్క ఇంట్లో ఉంటే కాసుల వర్షం కురుస్తుంది..!

Vastu Tip: కుబేర మొక్క ఇంట్లో ఉంటే కాసుల వర్షం కురుస్తుంది..!
x
Highlights

Vastu Tip: ఇంట్లో వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు ఉంచడం ద్వారా మనకు సానుకూల ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Vastu Tip: ఇంట్లో వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు ఉంచడం ద్వారా మనకు సానుకూల ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటిదే జెడ్ ప్లాంట్. దీనిని కుబేర మొక్క అని కూడా పిలుస్తారు. ఫెంగ్‌ షుయ్‌ వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో ఉంచితే ధనసంపద, సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్మకం.

ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. ఇంట్లో నెగిటివిటీ తగ్గి, పాజిటివిటీ పెరుగుతుంది. ఫెంగ్‌ షుయ్‌లో ఈ మొక్కను ధనాన్ని ఆకర్షించే మొక్కగా భావిస్తారు.

జెడ్ ప్లాంట్ పచ్చటి ఆకులుగా, చిన్న చిన్న కాయిన్స్ ఆకారంలో కనిపిస్తుంది. ఇది గాలిలో ఉన్న విష పదార్థాలను గ్రహించి శుభ్రమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. దాంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, ఆరోగ్యవంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

ఇంట్లో ప్రవేశ ద్వారం దగ్గర ఈ మొక్క పెట్టుకోవడం వల్ల శాంతియుత వాతావరణం నెలకొంటుంది. కెరీర్‌లో పురోగతి, విజయం చక్కగా కలిసివస్తాయి. ఫెంగ్‌ షుయ్‌ వాస్తు ప్రకారం ఈ మొక్క సంతోషాలను, సంపదను పెంచుతుంది.

ఈ కుబేర మొక్కను గిఫ్ట్‌గా కూడా ఇవ్వొచ్చు. కొత్త ఇంట్లోకి వెళ్లేవాళ్లకు, బిజినెస్ స్టార్ట్ చేసే వారికి గిఫ్ట్ చేయడం శుభ సూచికంగా భావిస్తారు. జీవితంలో సానుకూల మార్పులు, శుభ ఫలితాలు చూడాలనుకునేవారు ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవచ్చు.

వాస్తు శాస్త్రంలో, ఫెంగ్‌ షుయ్‌ నిబంధనల ప్రకారం జెడ్ ప్లాంట్ అంటే కేవలం మొక్క కాదు.. అదృష్టానికి చిహ్నం. ఇంట్లో ఈ మొక్కను పెంచడం ద్వారా ధన సంపద, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం దక్కుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories