Saturn Mercury Retrograde: శని, బుధుల మహాద్భుతం.. ఈ రాశుల వారికి జాక్పాట్.. డబ్బే, డబ్బు!

July Saturn Mercury Retrograde Astrology Effects
x

Saturn Mercury Retrograde: శని, బుధుల మహాద్భుతం.. ఈ రాశుల వారికి జాక్పాట్.. డబ్బే, డబ్బు!

Highlights

Saturn And Mercury Retrograde Effect On Zodiac: అత్యంత ఆసక్తికరంగా జూలై నెల ప్రారంభం కానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెల ఎంతో ప్రత్యేకంగా మారనుంది.

Saturn And Mercury Retrograde Effect On Zodiac: అత్యంత ఆసక్తికరంగా జూలై నెల ప్రారంభం కానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెల ఎంతో ప్రత్యేకంగా మారనుంది. ఎందుకంటే ఈ నెలలో శని, బుధ గ్రహాలు తిరోగమన దశలోకి ప్రవేశించబోతున్నాయి. శని గ్రహం జూలై 13న మీన రాశిలో తిరోగమనం చేయగా, బుధుడు జూలై 18న తిరోగమనం ప్రారంభించనున్నాడు. ఈ రెండు శక్తివంతమైన గ్రహాల తిరోగమన ప్రభావం వలన కొన్ని రాశుల వారికి అనుకోని లాభాలు, జీవన మార్పులు, మంచి అవకాశాలు లభించనున్నట్లు పండితులు చెబుతున్నారు.

మకర రాశి: ఈ గ్రహ మార్పుల ప్రభావంతో మకర రాశి వారికి అన్ని రంగాల్లో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు, వ్యాపారాల్లో లాభదాయకమైన ఒప్పందాలు జరగుతాయి. ఉద్యోగం పొందాలనుకున్న వారు, కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపుతట్టేలా ఉంటాయి. వైవాహిక జీవితంలో అనురాగం పెరిగి, శృంగారానుభూతులు పరిపుష్టి పొందుతాయి. ఆరోగ్యం మెరుగుపడి, కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కృషికి తగ్గ ప్రతిఫలం వచ్చి, మానసికంగా సంతోషంగా ఉంటారు.

వృషభ రాశి: వృషభ రాశి వారికి ఈ రెండు గ్రహాల తిరోగమన ప్రభావం ఆర్థికంగా విశేషంగా సహకరించనుంది. వ్యాపారాల్లో లాభాలు, పెట్టుబడులకు మంచి రాబడి, అనుకోని వనరుల ద్వారా డబ్బు వస్తుంది. ఉద్యోగ మార్పులు, ప్రమోషన్ అవకాశాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం, పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్నవారికి మంచి కంపెనీల నుంచి ఆఫర్లు రావచ్చు.

తులా రాశి: తులా రాశి వారికి జూలై నెల స్వర్ణావకాశాల నెలగా మారనుంది. శని, బుధుల తిరోగమన ప్రభావంతో అనుకున్న పనులు నిరంతరాయంగా పూర్తవుతాయి. ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. శత్రువులపై విజయం సాధించి, కుటుంబ, సామాజిక జీవితంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. మనసుకు హాయిగా, శుభవార్తలు వినిపించే సమయం ఇది.

ఈ జూలై నెలలో శని, బుధ గ్రహాల తిరోగమనం వల్ల ముఖ్యంగా మకర, వృషభ, తులా రాశుల వారికి అదృష్టం తలుపుతట్టనుంది. ఆర్థిక లాభాలు, వ్యాపార విజయం, ఆరోగ్య ఫలితాలు, శత్రువులపై ఆధిపత్యం, కొత్త అవకాశాలు… ఇలా అనేక శుభవార్తలతో ముందుకు సాగే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories