Jyestha Purnima 2025: 64 ఏళ్ల త‌ర్వాత అరుదైన యోగం...ఈ రెండు రాశుల వారికి పండ‌గే

Jyestha Purnima 2025
x

Jyestha Purnima 2025: 64 ఏళ్ల త‌ర్వాత అరుదైన యోగం...ఈ రెండు రాశుల వారికి పండ‌గే

Highlights

Jyestha Purnima 2025: ఈ సంవత్సరం జూన్ 11, 2025న జరగనున్న జ్యేష్ఠ పౌర్ణమి మరింత విశిష్టతను సంతరించుకుంది. ఎందుకంటే ఈ రోజు సరస్వతీ దేవి అధిపత్యం వహించే మూల నక్షత్రం కూడా ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే రవి, కుజులు సింహ రాశిలో సంచరించనున్న ఈ సమయాన్ని 64 ఏళ్ల తర్వాత సంభవిస్తున్న శుభయోగంగా పండితులు పేర్కొంటున్నారు.

Jyestha Purnima 2025: హిందూ పంచాంగంలో ప్రతీ మాసానికీ ప్రత్యేకమైన శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కార్తీక మాసానికి తర్వాత శ్రీమహావిష్ణువు అత్యంత ప్రీతిపాత్రుడిగా భావించేది జ్యేష్ఠ మాసమే. ఈ మాసంలో సాధారణంగా శుభకార్యాలు తగ్గిపోతాయి. కానీ భక్తితో భగవంతుని ఆరాధిస్తే, అతను ఇచ్చే ఫలితాలు అనుకోకుండా కలిసివస్తాయి.

ఈ సంవత్సరం జూన్ 11, 2025న జరగనున్న జ్యేష్ఠ పౌర్ణమి మరింత విశిష్టతను సంతరించుకుంది. ఎందుకంటే ఈ రోజు సరస్వతీ దేవి అధిపత్యం వహించే మూల నక్షత్రం కూడా ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే రవి, కుజులు సింహ రాశిలో సంచరించనున్న ఈ సమయాన్ని 64 ఏళ్ల తర్వాత సంభవిస్తున్న శుభయోగంగా పండితులు పేర్కొంటున్నారు.

ఈ పవిత్ర పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం చేయడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. విద్య, సంపద, ఆరోగ్యం, పరమాత్మ అనుగ్రహం కోరుకునే వారికి ఇది అత్యుత్తమ సమయం.

ఇక ఈ శుభ‌యోగం కార‌ణంగా రెండు రాశుల వారికి అదృష్టం క‌లిసొస్తుంద‌ని పండితులు చెబుతున్నారు. వృషభ రాశి వారికి అనుకోని ధనలాభం, లాటరీ లేదా భూముల కొనుగోలు అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో విజయాలు ల‌భిస్తాయి. కుటుంబంలో మనస్పర్థలు తొలగిపోతాయి. సామాజిక గౌరవం, బహుమతులు, గుర్తింపు పొందే అవకాశం ఉంది.

క‌న్య‌రాశి వారికి విదేశీ ప్రయాణ అవకాశాలు ల‌భిస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ రంగంలో పదోన్నతులు, పదవులు పొందే అవకాశం ఉంది. పెళ్లికి అనుకూలమైన సంబంధం ఏర్పడుతుంది.

రాజకీయాల్లో ఉన్న వారికి ఎదుగుదల ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories