Lunar Eclipse: చంద్ర గ్రహణం ప్రభావం.. ఈ 4 రాశులకు శుభఫలితాలు – మీ రాశి ఉందేమో చూడండి!

Lunar Eclipse: చంద్ర గ్రహణం ప్రభావం.. ఈ 4 రాశులకు శుభఫలితాలు – మీ రాశి ఉందేమో చూడండి!
x

Lunar Eclipse: చంద్ర గ్రహణం ప్రభావం.. ఈ 4 రాశులకు శుభఫలితాలు – మీ రాశి ఉందేమో చూడండి!

Highlights

Lunar Eclipse: సెప్టెంబర్ 7న భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఈ గ్రహణం కుంభరాశిలో జరుగుతుంది.

Lunar Eclipse: సెప్టెంబర్ 7న భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఈ గ్రహణం కుంభరాశిలో జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశిలో సంభవించే ఈ చంద్ర గ్రహణం కొన్ని రాశులకు ప్రత్యేక శుభఫలితాలను అందించనుందని నిపుణులు చెబుతున్నారు.

చంద్రగ్రహణం సమయం

ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి 9:58 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 గంటలకు ముగియనుంది.

శుభఫలితాలు పొందే రాశులు

మేష రాశి

లాభస్థానంలో ఏర్పడే ఈ గ్రహణం ఆర్థికంగా ఊహించని విజయాలు అందిస్తుంది.

♦ వ్యాపారులు కొత్త వ్యూహాలతో ముందుకు సాగి లాభాలు పొందుతారు.

♦ కుటుంబంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఉంటుంది.

♦ గ్రహణ సమయంలో శివాష్టోత్తరం పఠించడం శ్రేయస్కరం.

మిథున రాశి

♦ అదృష్టస్థానంలో ఏర్పడే ఈ గ్రహణం ఆర్థిక లాభాలను అందిస్తుంది.

♦ గత బకాయిలు వసూలవుతాయి, కొత్త పెట్టుబడులు లభిస్తాయి.

♦ పెద్దవారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

♦ గ్రహణ సమయంలో లింగాష్టకం పఠించడం మేలును ఇస్తుంది.

కన్య రాశి

♦ శత్రు, వ్యాధి సంబంధిత స్థానంలో ఏర్పడే ఈ గ్రహణం శుభప్రదం.

♦ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు.

♦ ఉద్యోగులకు ప్రమోషన్లు, జీతం పెరుగుదల అవకాశాలు ఉన్నాయి.

♦ ఆరోగ్యం, ఐశ్వర్యం పుష్కలంగా ఉంటాయి.

♦ గ్రహణ సమయంలో మహాలక్ష్మి అష్టకం పఠించడం శ్రేయస్కరం.

వృశ్చిక రాశి

♦ కుటుంబం, సౌకర్యాలకు సంబంధించిన స్థానంలో ఏర్పడే ఈ గ్రహణం అన్ని కోరికలు నెరవేర్చుతుంది.

♦ ఇల్లు, వాహనం కొనుగోలు వంటి కలలు నిజమవుతాయి.

♦ ఆధ్యాత్మిక ప్రయాణాలు, కుటుంబ సంతోషాలు కలుగుతాయి.

♦ చేపట్టిన పనులన్నింటిలో విజయం సాధిస్తారు.

♦ గ్రహణ సమయంలో శ్రీలక్ష్మి కుబేర స్తోత్రం పఠించడం శ్రేయస్కరం.


ముఖ్య సూచన: పైన చెప్పిన వివరాలు నిపుణుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే. వీటికి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు. నమ్మకం పూర్తిగా వ్యక్తిగత విషయం.

Show Full Article
Print Article
Next Story
More Stories