Powerful Rajyoga: గ్రహాల కలయికతో బిగ్ టర్న్.. అదృష్టం పట్టే రాశులు ఇవే

Powerful Rajyoga: గ్రహాల కలయికతో బిగ్ టర్న్.. అదృష్టం పట్టే రాశులు ఇవే
x

Powerful Rajyoga: గ్రహాల కలయికతో బిగ్ టర్న్.. అదృష్టం పట్టే రాశులు ఇవే

Highlights

Powerful Rajyoga: మార్చిలో శని, సూర్యుడు, శుక్రుడు కలయికతో రాజయోగం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నాలుగు రాశుల వారికి అనుకూల ఫలితాలు లభించే సూచనలు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, గ్రహాల కలయికల వల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడతాయని భావిస్తారు. మార్చి నెలలో శని, సూర్యుడు, శుక్రుడు ఒకే రాశిలో సంచరించనున్న నేపథ్యంలో శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ గ్రహ సంయోగం మీన రాశిలో చోటుచేసుకోనుంది. దీని ప్రభావం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ సంయోగం ప్రభావంతో సింహ రాశి వారికి వృత్తి రంగంలో గుర్తింపు పెరిగే అవకాశం ఉందని, బాధ్యతలు కూడా పెరగవచ్చని సూచిస్తున్నారు. మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు.

వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం ఉందని, ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ధనుస్సు రాశి వారు విద్య, ఉపాధి, ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు పొందవచ్చని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి.

గమనిక: ఈ వివరాలు జ్యోతిష్య విశ్వాసాలు, పంచాంగ ఆధారిత అంచనాల ప్రకారం మాత్రమే. వ్యక్తిగత ఫలితాలు భిన్నంగా ఉండవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories