Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 9th July 2024

Rasi Phalalu Daily Horoscope For 9th July 2024 Tuesday In Telugu
x

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 9th July 2024

Highlights

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 9th July 2024

09-07-2024 (మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : తదియ ఉదయం గం.6.08 ని.ల వరకు ఆ తర్వాత చవితి

నక్షత్రం: ఆశ్లేష ఉదయం గం.7.52 ని.ల వరకు ఆ తర్వాత మఖ

అమృతఘడియలు: ఉదయం గం.6.09 ని.ల నుంచి గం. 7.52 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.9.04 ని.ల నుంచి గం. 10.49 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.25 ని.ల నుంచి గం.9.18 ని.ల వరకు ఆ తర్వాత రాత్రి గం.11.16 ని.ల నుంచి అర్ధరాత్రి గం. 12.00 ని.ల వరకు

రాహుకాలం : సాయంత్రం గం.3.38 ని.ల నుంచి గం.5.16 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.48 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.55 ని.లకు


మేషం :

అత్యుత్సాహం పనికిరాదు. సొంత తెలివితేటలను ప్రదర్శించకండి. ఆలోచనలు సవ్యంగా సాగవు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ధన నష్టం ఉంది.. జాగ్రత్త. అభీష్టం నెరవేరక పోవడం విచారాన్ని కలిగిస్తుంది.


వృషభం :

అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. వృథా ఖర్చులుంటాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు బెడిసికొడతాయి. అవమానాలుంటాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.


మిథునం :

అభీష్టం నెరవేరుతుంది. ఒప్పందాలు కుదుర్చుకునేందుకు బాగుంటుంది. మధ్యవర్తిత్వ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరమైన సమాచారాన్ని రాబడతారు.


కర్కాటకం:

అనవసరమైన వాటికి ఖర్చు చేస్తారు. చెప్పుడు మాటల వల్ల చేటు తప్పదు. ఇతరుల సూచనలకు సొంత తెలివి తేటలను జోడించండి. తగాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి.


సింహం :

అనువైన రోజిది. అభీష్టం నెరవేరుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. కొత్త విషయాలను గ్రహిస్తారు. గౌరవం పెరుగుతుంది. విందులో పాల్గొంటారు.


కన్య :

పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వేళకు సరైన బోజనం ఉండదు. బద్ధకం కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. మిత్రులతో సత్సంబంధాలు కొనసాగించాలి.


తుల :

కార్యసాధనలో అందరి తోడ్పాటు లభిస్తుంది. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రుణ సంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆత్మీయులతో కలిసి భోజనం చేస్తారు.


వృశ్చికం :

సర్వత్రా విజయాలుంటాయి. మేలిమి అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రతిభను చూపుతారు. పోటీదారులు కనుమరుగవుతారు. కొత్త బాధ్యతలు చేపడతారు. గృహశాంతి ఉంటుంది.


ధనుస్సు :

మీ బలహీనతపై దెబ్బ పడుతుంది. శత్రువుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు విధుల నిర్వహణలో ఇబ్బంది పడతారు. దూర ప్రయాణం ఉంది. మనశ్శాంతికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.


మకరం :

పనులు అనుకున్నట్లుగా సాగవు. ఆలోచనలు వక్రగతిలో సాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగులు అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. స్వల్ప తగాదాలూ ఉంటాయి.


కుంభం :

ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులను కలుస్తారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రయాణాలు శుభంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారం తృప్తినిస్తుంది.


మీనం :

శుభ ఫలితాలుంటాయి. ధన సంబంధ చింత తొలగుతుంది. కొత్త వస్తువులు కొంటారు. బంధుమిత్రులతో గడుపుతారు. పుణ్య కార్యాలు నిర్వహిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీర్తి పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories