Shani Dev Effect 2026: ఏలినాటి శనితో ఈ రాశులకి ఉపశమనం.. బిగ్ జాక్‌పాట్ ఖాయం!

Shani Dev Effect 2026: ఏలినాటి శనితో ఈ రాశులకి ఉపశమనం.. బిగ్ జాక్‌పాట్ ఖాయం!
x

Shani Dev Effect 2026: ఏలినాటి శనితో ఈ రాశులకి ఉపశమనం.. బిగ్ జాక్‌పాట్ ఖాయం!

Highlights

Shani Dev Effect 2026: 2026లో శని అస్తమనం ప్రభావంతో ఏలినాటి శని నుంచి కొన్ని రాశుల వారికి ఉపశమనం. ధనస్సు, కుంభ, మీన రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ లాభాలు.

Shani Dev Effect 2026: శని గ్రహ ప్రభావం 2026లో మరింత ప్రాధాన్యత సంతరించుకోనుంది. ముఖ్యంగా మార్చి నెలలో శని అస్తమనం నేపథ్యంలో కొన్ని రాశుల వారికి ఊరట లభించనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఈ సమయంలో ఆర్థిక, వృత్తి పరమైన అనుకూల ఫలితాలు కనిపించనున్నట్లు అంచనా వేస్తున్నారు.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, శని గ్రహాన్ని కర్మలకు ఫలితాలను అందించే గ్రహంగా పరిగణిస్తారు. వ్యక్తులు చేసే మంచి, చెడు కర్మల ఆధారంగా శని ఫలితాలు ఇస్తాడని విశ్వాసం. శని జాతకంలో అశుభ స్థానంలో ఉన్నప్పుడు మానసిక, శారీరక, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ క్రమంలో మార్చి 13వ తేదీ సాయంత్రం మీన రాశిలో శని గ్రహం అస్తమించనుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండగా, మరికొన్ని రాశుల వారికి విశేషమైన లాభాలు కలగనున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ సమయంలో అదృష్టం కలిసి రానుందని పేర్కొంటున్నారు.

ఈ రాశుల వారికి శని అనుకూల ఫలితాలు:

ధనస్సు రాశి:

ధనస్సు రాశివారికి శని ప్రభావంతో భౌతిక సౌఖ్యాలు పెరుగుతాయి. ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి.

కుంభ రాశి:

కుంభ రాశిలో పంచగ్రహి రాజయోగం ఏర్పడనుంది. దీని వల్ల వ్యాపారాల్లో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. మీడియా, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి ప్రత్యేక అవకాశాలు లభించనున్నాయి. మాటల ప్రభావంతో కొత్త అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి.

మీన రాశి:

మీన రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజికంగా గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వామ్యాల్లో లాభాలు, వైవాహిక జీవితంలో అనుకూలత కనిపిస్తుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తి కావడంతో పాటు ఆర్థిక లాభాలు కూడా సాధ్యమవుతాయి.

మొత్తంగా శని అస్తమనం ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి ఊరటతో పాటు కొత్త అవకాశాలు లభించనున్నాయని జ్యోతిష్యులు విశ్లేషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories