Shani Transit: మార్చి 29 శని రాశి మార్పు.. మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువును వెంటనే బయట పారేయండి, లేకపోతే దురదృష్టానికి రెడ్‌కార్పెట్‌ పరిచినట్టే..

Shani Transit
x

Shani Transit: మార్చి 29 శని రాశి మార్పు.. మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువును వెంటనే బయట పారేయండి, లేకపోతే దురదృష్టానికి రెడ్‌కార్పెట్‌ పరిచినట్టే..

Highlights

Remove Things Before Shani Transit: మార్చి 29 అమావాస్య, సూర్యగ్రహణం. అంతేకాదు ఈరోజు శని దేవుడు కూడా కుంభ రాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది.

Remove Things Before Shani Transit: మార్చి 29వ తేదీ శని దేవుడు రాశి మార్చనున్నాడు. కుంభరాశిలో నుంచి మీన రాశిలోకి శని మార్పు జరగనుంది. ఈ నేపథ్యంలో దీని ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. అయితే ఈలోగా మీ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు తీసేయండి. ఈ పనులు శనిమార్పు ముందుగా పూర్తి చేయండి. ఇది వృత్తి, వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు, కర్మలపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో మీ ఇంటి నుంచి బయట పడేయాల్సిన ఐదు వస్తువులు ఏంటో తెలుసుకుందాం ..

చినిగిన దుస్తులు..

చినిగిన దుస్తులు కూడా శనికి ప్రతిరూపంగా చెబుతారు. ఈ నేపథ్యంలో మీ ఇంట్లో నిరుపయోగంగా ఉన్న దుస్తులను వెంటనే బయట పారేయండి. ఇవి పేదరికానికి ప్రతిరూపం. అంతేకాదు దీనివల్ల మీ ఇంట్లో నెగటివిటీ పెరిగిపోతుంది. ఇవి కాకుండా వాడని చెప్పులు ఇతర వస్తువులు కూడా దానం చేయాలి. లేకపోతే ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది.

వాడని ఎలక్ట్రానిక్ వస్తువులు ..

మీ ఇంట్లో నిరుపయోగంగా పడి ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఇంట్లో నుంచి పారేయండి. శని దేవుడుతో పాటు రాహువు కూడా రాశి మారబోతున్నాడు అన్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో శక్తికి సంబంధించిన ఇలాంటి వస్తువులు బయట పారేయాలి. విరిగిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో నెగెటివిటీకి నిదర్శనం. ఇది వ్యాపార, వృత్తి జీవితాలపై ప్రభావం చూపుతుంది.

నిరుపయోగమైన మందులు ..

ఇవి మాత్రమే కాదు ఇంట్లో చాలామంది నిరుపయోగం కా ఎక్స్‌పైరీ అయిపోయిన మందులను అలాగే వదిలేస్తారు. ఇది కూడా ఇంట్లోంచి త్వరగా పాడేయండి. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది .

ఎండిపోయిన చెట్లు..

శని రాశి మార్పు ముందే మీ ఇంట్లో ప్రాణం లేని ఎండిపోయిన చెట్లు ఉంటే వెంటనే తొలగించండి.. అంతేకాదు ముళ్ళ చెట్లు ఉంటే కూడా తొలగించాలి. వాడిపోయిన ఆకులు, చెట్లు కూడా నెగెటివిటీకి ప్రతిరూపం. వీటిని ఇంట్లో నుంచి తీసేయడం మంచిది.

విరిగిన బొమ్మలు

చాలామంది ఇళ్లలో విరిగిపోయిన బొమ్మలు అలాగే వదిలేస్తారు. అయితే ఇది శని దోషానికి దారితీస్తుంది. విరిగిన బొమ్మలు వెంటనే ఇంట్లోంచి తీసి పారేయండి. వీటిని నీటిలో లేదా ఇతర ప్రాంతాల్లో పారేయాలి.

మీ ఇంట్లో నిరుపయోగంగా ఉండే బిల్లులు, పేపర్లు కూడా పారేయండి. ఇంట్లో వార్తాపత్రికలు కూడా అలాగే వదిలేస్తారు. వీటివల్ల నెగటివిటీకి పెరుగుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగాలంటే వీటిని వెంటనే బయట పారేయండి.

విరిగిన అద్దాలకు కూడా ఇంట్లో చోటు ఇవ్వకూడదు. ఇది కూడా దురదృష్టానికి.. ఇంట్లో నెగటివీటికి దారితీస్తుంది. వీటితోపాటు మీ ఇంట్లో ఉన్న విరిగిపోయిన ఫర్నిచర్ కూడా వెంటనే తీసేయండి. ఇది కూడా వాస్తు దోషానికి దారితీస్తుంది. ఇంట్లో ఆగిపోయిన గడియారాలు వాచీలు కూడా వెంటనే తీసేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories