Sri Rama Navami 2025: శ్రీరామ నవమి అత్యంత శుభ యోగం.. ఈ 3 రాశులకు స్వర్ణ యుగ ఆరంభం

Sri Rama Navami 2025
x

Sri Rama Navami 2025: శ్రీరామ నవమి అత్యంత శుభ యోగం.. ఈ 3 రాశులకు స్వర్ణ యుగ ఆరంభం

Highlights

Sri Rama Navami Lucky Zodiac Signs: శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. 2025 ఏప్రిల్ 6 ఆదివారం శ్రీరామనవమి నిర్వహిస్తున్నారు. ఈరోజు నుంచి 3 రాశులకు స్వర్ణయుగం.

Sri Rama Navami Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరామ నవమి నుంచి మూడు రాశులకు బంపర్ అవకాశాలు పెరుగుతాయి. ఇది వారికి స్వర్ణ యుగం ప్రారంభం. ఎందుకంటే శ్రీరాముడు కర్కాటక రాశి, పునర్వసు నక్షత్రంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాశుల వారికి సువర్ణ యుగం ప్రారంభం అవుతుంది.

రేపు ఆదివారం ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. చైత్రమాసం నవమి రోజు శ్రీరామనవమి జరుపుతారు. ఈరోజు శ్రీరాముని పుట్టినరోజు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు సీతారాముల కళ్యాణం వైభవంగా అన్ని ఆలయాల్లో నిర్వహిస్తారు.

శ్రీరామ నవమి శ్రీరాముడు కర్కాటక రాశి, పునర్వశి నక్షత్రంలో మధ్యాహ్నం జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ సమయంలోనే సీతారాముల కళ్యాణం జరుపుతారు. నవమి తిథి, రవిపుష్య యోగం. సర్వార్ధ సిద్ధియోగం వంటి శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి.

కర్కాటక రాశి..

శ్రీరామనవమి నుంచి కర్కాటక రాశికి ఆనందం, శ్రేయస్సు వీళ్ళకి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రత్యేకంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. పని ప్రదేశంలో కూడా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి. కర్కాటక రాశి వారు కొత్త ఉద్యోగం ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి.

మేష రాశి..

మేష రాశి వారికి కూడా ఈ శ్రీరామనవమి స్వర్ణయుగమని చెప్పాలి వీరికి వ్యాపారంలో భారీ లాభాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ప్రత్యేకంగా వీళ్ళకి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఈరోజు నుంచి మంచి కాలం ప్రారంభం అవుతుంది. ఆర్థిక వనరులు పెరిగే అవకాశం ఉంది.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి వారికి కొత్త ఉద్యోగాలు సఫలమవుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అంతే కాదు వీళ్ళకి ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ఉద్యోగాల ప్రశంసలు పదోన్నతి కూడా పొందే సమయం.

Show Full Article
Print Article
Next Story
More Stories