Taurus Horoscope 2026: 2026 వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది.. కానీ ఒక్క విషయంలో జాగ్రత్త అవసరం!

Taurus Horoscope 2026
x

Taurus Horoscope 2026: 2026 వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది.. కానీ ఒక్క విషయంలో జాగ్రత్త అవసరం!

Highlights

Taurus Horoscope 2026 in Telugu: నూతన సంవత్సరం 2026లో వృషభ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

Taurus Horoscope 2026 in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండో రాశి అయిన వృషభ రాశికి శుక్రుడు అధిపతి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ రాశికి చెందుతారు. నూతన సంవత్సరం 2026లో వృషభ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది శుభ, అశుభ ఫలితాల మిశ్రమంగా ఉండనుందని, అయితే విద్యార్థులు, వ్యాపారవేత్తలు, రైతులు, మహిళలు, కళాకారులు, క్రీడాకారులు ఇలా అన్ని వర్గాలకూ కొంత మేర అనుకూల ఫలితాలు ఉంటాయని అంచనా.

అయితే ఈ ఏడాది వృషభ రాశి వారు ఒక ముఖ్యమైన విషయంలో అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. ఆ అంశం ఏమిటంటే.. ఆర్థిక వ్యవహారాల్లో నిర్లక్ష్యం, అనవసర ఖర్చులు.

2026లో వృషభ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సంవత్సరం ద్వితీయార్థంలో ఆదాయం పెరిగినా ఖర్చులు అదుపు తప్పే ప్రమాదం ఉంది.

♦ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు రెండుసార్లు ఆలోచించడం, పెద్దల సలహా తీసుకోవడం మంచిది.

♦ వడ్డీలకు డబ్బు ఇచ్చే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

♦ ఆరోగ్యపరంగా గొంతు, థైరాయిడ్‌, ఛాతీ సంబంధిత సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. క్రమబద్ధమైన ఆహారం, యోగా, వ్యాయామం ద్వారా జాగ్రత్త తీసుకోవాలి.

♦ కుటుంబ విషయాల్లో మాట తీరుపై నియంత్రణ అవసరం. చిన్న అపార్థాలు పెద్ద మనస్పర్థలుగా మారకుండా ఓర్పుగా వ్యవహరించాలి.

వృషభ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు

♦ ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ అమ్మవారిని తెల్లటి పువ్వులతో పూజించడం శుభప్రదం.

♦ పాయసం లేదా తెల్లటి స్వీట్లు నైవేద్యంగా సమర్పించవచ్చు.

♦ వీలైనప్పుడు వెంకటేశ్వరస్వామి, వినాయకుని దర్శనం చేయడం మంచిది.

♦ శుక్రవారం పేదలకు బియ్యం, పాలు, పంచదార వంటి తెల్లని వస్తువులు దానం చేయాలి.

♦ శని ప్రభావ నివారణకు ప్రతి శనివారం ఆంజనేయస్వామిని పూజించాలి.

వృషభ రాశి వారు పఠించాల్సిన మంత్రాలు

♦ శుక్రవారం కనకధారా స్తోత్రం లేదా లక్ష్మీ అష్టకం పఠించాలి.

♦ శనివారం విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదం.

♦ మానసిక ప్రశాంతత కోసం “ఓం నమః శివాయ” జపం చేయాలి.

శుక్ర అనుగ్రహానికి:

“ఓం భార్గవాయ విద్మహే ధనుర్ధరాయ ధీమహీ తన్నో శుక్రః ప్రచోదయాత్” మంత్రం పఠించవచ్చు.

ముఖ్య గమనిక: పై సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్య అంచనాల ఆధారంగా ఇవ్వబడింది. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు నమ్మాలన్నది వ్యక్తిగత నిర్ణయం మాత్రమే.

Show Full Article
Print Article
Next Story
More Stories